పులివెందుల ఎన్నికల గురించి జగన్ ప్రస్తావిస్తూ చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలు అంటూ జగన్ కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు వయస్సు ప్రస్తుతం 75 సంవత్సరాలు కావడంతో జగన్ ప్రధానంగా ఈ కామెంట్లు చేయడం జరిగింది. పులివెందులలో రీపోలింగ్ జరగగా రీపోలింగ్ లో సైతం అక్రమాలు జరిగాయని వైసీపీ చెబుతోంది.

అయితే చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన కామెంట్ల విషయంలో కూటమి అనుకూల పత్రికల నుంచి ఊహించని స్థాయిలో కౌంటర్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. జగన్ ఏ ఉద్దేశంతో ఈ కామెంట్లు చేశారనే చర్చ సైతం ఇప్పటికే మొదలైంది.  చంద్రబాబు నాయుడు సైతం జగన్ చేసిన కామెంట్లను ఒకింత సీరియస్ గా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నయని కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు నాయుడు తన హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటూ ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రాజకీయాల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నా అందుకు భిన్నంగా జరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో రాబోయే రోజుల్లో  ఏ స్థాయిలో సత్తా చాటుతారో చూడాలి. లోకేష్ ను ముఖ్యమంత్రిగా చూడాలని చంద్రబాబు నాయుడు కల కాగా ఆ కల నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఐదేళ్లకు ఒక పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉండటం కొసమెరుపు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: