
తాజాగా టిడిపి మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఈ దొంగ ఓట్ల విషయంలో వైసీపీ వారు హాట్ లైన్ ద్వారా రాహుల్ గాంధీకి నేర్పించినట్టుగా ఉందంటూ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో తాము బలమైన, నమ్మకమైన భాగస్వామ్యంతో ఉంటున్నామంటూ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు కూడా తమ పార్టీ మెంబరే అంటూ వెల్లడించారు. మీకు కూడా కెసిఆర్ మధ్య సంబంధం బాంధవ్యాలు ఉన్నాయి కాద?గిఫ్టులు, రిటర్న్ గిఫ్టులు ఏమైపోయాయి అంటూ జగన్ ని విమర్శించారు.
వైసిపి నేతలు ప్రజాస్వామ్యం పైన మాట్లాడుతూ ఉంటే చాలా నవ్వొస్తోంది ప్రజలు క్యాడర్ ని రెచ్చగొట్టేందుకే జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారంటూ పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు. పులివెందులలో ప్రజలు ధైర్యంగా ఓటు వేశారని రేపు వచ్చిన ఫలితాలను స్వీకరించడానికి జగన్ సిద్ధంగా ఉండాలంటు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఇప్పుడు జాతీయస్థాయిలో ఒక గొప్ప లీడర్ అంటూ.. మరో 10 ఏళ్ల పాటు సీఎం గా చంద్రబాబు ఉంటారని, ప్రజా సంక్షేమం ,అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.. శాంతి భద్రతలతో ఏపీ అంతా చాలా బాగుందంటూ తెలిపారు మంత్రి పయ్యావుల కేశవ్. రాబోయే ఎన్నికలలో వైసీపీ బరిలో నిలిచేందుకు అర్హులు ఉంటారు లేదో చూసుకోవాలంటు మాట్లాడారు.