ముంబైలోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో RBI ఒక సంచలనం సృష్టించింది.. అదేమిటంటే నగరంలోనే అత్యంత ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి నారియన్ ప్రాంతంలో ఉన్న 4.6 ఎకరాల స్థలాన్ని భారీ ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.. ముంబైలో మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ స్థలాన్ని ఏకంగా RBI రూ.3,472 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇది ఒక సరికొత్త రికార్డుగా నిలిచిన లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.


అయితే ఈ డీల్ ప్రాముఖ్యతను వివరిస్తూ RBI ఏకంగా రూ.208 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ల్యాండ్ మంత్రాలయ మరియు బాంబే హైకోర్టు, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, కార్పొరేట్ హెడ్ క్వార్టర్లకు సైతం చాలా దగ్గరగా ఉండడం వల్లే దీని విలువ ఇంత పెరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి MMRCL ఈ భూమిని బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని ప్రయత్నించినప్పటికీ తన కార్యకలాపాలను విస్తరింప చేసుకోవాలనే ప్రణాళికలో భాగంగా RBI ఈ స్థలం పైన ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. అందుకే MMRCL కూడా ఈ వేళాన్ని రద్దు చేసి డైరెక్ట్ గా ఆర్బిఐ కి ఇచ్చేసింది.


ఈ కొనుగోలు ద్వారా RBI తన ప్రధాన కార్యాలయాన్ని విస్తరింప చేసుకొనే అవకాశం ఉన్నది. ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ కు ఉండేటువంటి అపారమైన సామర్థ్యాన్ని మరొకసారి నిరూపించినట్లుగా కనిపిస్తోంది. వీటికి తోడు RBI  భవిష్యత్తు అవసరాల కోసం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ఇప్పుడు తెలుస్తోంది. ఈ స్థలాన్ని కొనుగోలు చేయడం వల్ల ముంబైలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ విలువలకు, దేశంలో ఆర్థిక స్థిరత్వానికి కేంద్రంగా ఉండేటువంటి RBI ప్రాముఖ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. RBI తన కార్యాలయాల అవసరాల కోసమే కాకుండా నగరంలోనే అత్యంత విలువైన ప్రాంతాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: