
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ ప్రియాంకా మోహన్.. తన కోస్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు సెట్ లో ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవారు. ఎక్కువగా పుస్తకాలు చదువుతూ కనిపించేవారు. లేదా పార్టీ మెంబర్స్ వస్తే మాట్లాడుతూ ఉండేవారు. ఎన్నికల్లో గెలిచాక డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టాక ఆయనలో మార్పు కనిపించింది. చాలా హ్యాపీ, కూల్‌గా, మరింత బాధ్యతగా కనిపించారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు కూడా.
అయితే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కూడా ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. సెట్లో అందర్నీ ఈక్వల్ గా చూస్తారు. నేలపై, మెట్లపైనే కూర్చోవడానికి ఇష్టపడతారు. ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తెరపైనే కాదు తెర వెనుక కూడా ఆయన రియల్ హీరో` అంటూ ప్రియాంకా మోహన్ చెప్పుకొచ్చింది. ఇక ఓజీ గురించి మాట్లాడుతూ.. ఇది కంప్లీటెడ్ యాక్షన్ ఫిల్మ్ కాదని, ఇందులో బలమైన ఫ్యామిలీ డ్రామా కూడా ఉందని, దాని చుట్టూనే యాక్షన్ ఓ భాగంగా ఉంటుందని ప్రియాంకా పేర్కొంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు