
ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమెకు ఛాన్స్ వచ్చినా, కథ కంటెంట్ తనకు కన్విన్స్ చేయలేదని చెబుతూ అంగీకరించలేదన్న వార్తలు బాగా వినిపించాయి. అంటే స్టార్ హీరోతో నటించే అవకాశం దొరికినా, తన ప్రిన్సిపిల్స్ కి విరుద్ధంగా ఉంటే ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా “నో” చెప్పేసింది. అయితే తాజాగా మాత్రం సాయి పల్లవిని ఒక తెలుగు హీరో రిజెక్ట్ చేశాడనే వార్త బాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదెవరో కాదు యూత్ స్టార్ విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమాలో హీరోయిన్‌గా మొదటగా సాయి పల్లవినే ఫిక్స్ చేశారట. కానీ కథలో ఒక లిప్‌లాక్ సీన్ ఉందని తెలిసిన వెంటనే సాయి పల్లవి ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపదని విజయ్ నే రిజెక్ట్ చేశారట. ఆమె తనకున్న రూల్స్‌ని చూపిస్తూ, “ఇలాంటి సీన్స్ చేయలేను, కాబట్టి ఈ సినిమాలో నేను చేయను” అని చెప్తుంది అని నిర్మాతలతో పాటు విజయ్ దేవరకొండ కూడా ఇబ్బందులు రాకుండా, “ సాయి పల్లవి వద్దు ఈ రోల్ కి” అంటూ రిజెక్ట్ చేశాడని టాక్. అందరినీ రిజెక్ట్ చేస్తూ తనదైన మార్గంలో వెళ్తున్న సాయి పల్లవికి, ఈసారి స్టార్ హీరో విజయ్ దేవరకొండే నో చెప్పడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమై, అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.