బీహార్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం రాను రాను రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ బలం లేకపోయినా సీట్లు తీసుకుని ఓడిపోయి అధికారాన్ని ఇతర పార్టీలకు కట్టబెట్టే పరిస్థితి తెచ్చుకుంటుంది. గత ఎన్నికలలో అదే జరిగింది. దీంతో ఆర్జెడి ఇప్పుడు జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మాట్లాడకుండా తాము ఇచ్చిన సీట్లలో పోటీచేసి స్నేహాన్ని కాపాడుకోవాలని లేకపోతే ఒంటరి అయిపోతారని వార్నింగ్‌ ఇస్తోంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి అని చెప్పాలి. 2020 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీహార్లో 70 సీట్లకు పోటీ చేసి కేవలం 19 సీట్లలో మాత్రమే గెలిచింది. లాలూ ప్రసాద్ యాదవ్ అప్పుడే గుస్సా అయ్యారు. ఇప్పుడు అదే తప్పు చేయాలని కాంగ్రెస్ అంటోంది. తనకు గతంలో కేటాయించిన 70 సీట్లు కేటాయించాలని అంటుంది .ఒంటరిగా అయినా పోటీ చేస్తామని ఈసారి అలాంటి ఛాన్స్ లేదని ఆర్జెడితో చెబుతోంది.


ఆర్జెడి గత ఎన్నికలలో 144 సీట్లలో పోటీ చేసి 75 సీట్లు గెలిచింది. 17 సీట్లు ఐదువేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోయిన సీట్లలో మార్జిన్ చాలా ఎక్కువగా ఉంది. బీహార్ లో ఉన్న మొత్తం 243 సీట్లలో పోటీ చేయడానికి తమ సిద్ధంగా ఉన్నాం అని తేజస్వి యాదవ్ ప్రకటించడంతో ఇండి కూటమిలో పరిస్థితి దిగజారిపోయిందని అందరికీ అర్థమైంది. ఇది రాహుల్ గాంధీకి ఇబ్బందికరమే అయినా.. మొహమాట పడకూడదని లాలు కుటుంబం డిసైడ్ అయింది. కాంగ్రెస్ బీహార్ లో ఒంటరిగా పోటీ చేస్తే కనీస సీట్లు గెలిచే పరిస్థితి లేదు. అందుకే కాంగ్రెస్ ఆర్జెడి ఒత్తిడికి తలొగ్గ‌టం తప్ప మరో మార్గం లేదు. ఇండికూటమిలో కమ్యూనిస్టులతో పాటు మరికొన్ని పార్టీలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ సీట్ల షేర్ ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ మిత్రులను దూరం చేసుకుని హర్యానా ఢిల్లీలో ఘోరపరాజ‌యం పాలయ్యింది. బీహార్లో మిత్రులను నిలుపుకోవాలి అంటే ఈ మాత్రం త్యాగాలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: