
అద్దంకి వైసీపీకి నాన్ లోకల్ కమ్మ.. గొట్టిపాటి డబుల్ హ్యాట్రిక్‌కు లైన్ క్లీయర్ చేసిన జగన్..?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు పెట్టనికోటగా మారిన అద్దంకి నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్ గా చింతలపూడి అశోక్ కుమార్ అనే వ్యక్తిని తాజాగా జగన్ నియమించారు. ఈ నియామక ప్రకటన వచ్చిన తర్వాత అసలు ఎవరా ఈ అశోక్ అని వైసీపీ వాళ్లే ఆరాలు తీసే పనిలో పడ్డారు. ఈ అశోక్ ఎవరంటే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల వద్ద జానపాడుకు చెందిన వైద్యుడు. పిడుగురాళ్లలో పల్నాడు ఆస్పత్రి ని ఆయన నిర్వహిస్తున్నారు. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈయన సోదరుడు చింతలపూడి శ్రీనివాసరావు 2019లో గురజాల నుంచి జనసేన తరపున ఓ సారి పోటీ చేశారు. గత ఎన్నికలకు ముందు అశోక్ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో చేరారు. ఇప్పుడు సోదరుడు జనసేనలోనే ఉన్నారేమో కానీ ఈయన మాత్రం వైసీపీ ఇంచార్జ్ అయిపోయారు.
ఇక జగన్ బాబాయ్ .. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి బినామీగా ఉంటూ వ్యాపారాలు చేసుకునే పాణెం హనిమిరెడ్డి ఆయనను గత ఎన్నికల్లో అద్దంకి నుంచి పోటీకి నిలబెట్టారు. ఆయనది కూడా పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలంలోని దోడ్లేరు. ఇప్పుడు కూడా మళ్లీ అదే పల్నాడు జిల్లాకు చెందిన కమ్మ డాక్టర్‌కు అద్దంకి పగ్గాలు ఇవ్వడం స్థానిక వైసీపీ కేడర్‌కు అస్సలు నచ్చడం లేదు. గత ఎన్నికల్లో హనిమిరెడ్డి కి భారీగా చేతి చమురు వదిలింది. ఇప్పుడు మళ్లీ జిల్లాలు దాటి మరీ నేతను తెచ్చి పెట్టడం ఏంటో వైసీపీ వాళ్లకే అర్థం కావట్లేదు. రవికి ఇప్పుడు మరోసారి తిరుగులేకుండా డబుల్ హ్యాట్రిక్ కు జగన్ లైన్ క్లీయర్ చేస్తున్నారని.. శోక్ కుమార్ ను పూర్తిగా నాకించేస్తారని.. ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.