ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని విద్యార్థులు వేయికళ్లతో వేచి చూస్తుంటారు. సెలవులు అంటే చాలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు విద్యార్థులు.అలా ప్రతి ఏడాది కూడా దసరా పండుగ సందర్భంగా అన్ని కాలేజీలు ,పాఠశాలలు సెలవులు ప్రకటిస్తూ ఉంటాయి. దీంతో అటు విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా కుటుంబంతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా హాస్టల్లో ఉండే విద్యార్థులు తమ సొంత ఊర్లకు వెళ్లి అక్కడ బంధువులు స్నేహితులు కుటుంబంతో ఎంజాయ్ చేయాలని చేస్తూ ఉంటారు.. తాజాగా ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు పైన అధికారికంగా ప్రకటన చేసింది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పాఠశాలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది. మొత్తం మీద 9 రోజులపాటు విద్యార్థులకు ఈ దసరా సెలవులు ప్రకటించారు. తిరిగి మళ్లీ అక్టోబర్ 3వ తేదీన విద్యార్థులు పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసిన విద్యార్థులు సైతం ఆనందపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలతో కలసి పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులను సురక్షితంగా ఇంటికి చేరుకునేలా తల్లిదండ్రులకు ముందుగానే సమాచారమిచ్చిఅన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఉండాలని విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు.


తెలంగాణ ప్రభుత్వ విషయానికి వస్తే అక్కడ ప్రభుత్వం 13 రోజులపాటు దసరా సెలవులను ప్రకటించినట్లు తెలుస్తోంది అంటే సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయి. అలా రెండు తెలుగు రాష్ట్రా విద్యార్థులు చాలా ఆనందంగా దసరా పండుగ జరుపుకోబోతున్నారు. ఒకవైపు పండుగ సంబరాలే కాకుండా మరొకవైపు పాఠశాలల నుంచి కూడా కాస్త విరామం దొరకడంతో విద్యార్థుల సంతోషానికి అవధులు లేకుండా ఉన్నాయి. పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి స్పెషల్ క్లాసులు విషయంపై ఎలాంటి విషయాన్ని ఏపీ , తెలంగాణ ప్రభుత్వం తెలియజేయలేదు.అలాగే దసరా పండుగ సందర్భంగా మూడు రోజులపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: