
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 రెండు దశలలో ఈ పోలింగ్ జరగబోతోంది. అధికార పార్టీ జనతాదళ్ (యునైటెడ్) బిజెపి, రాష్ట్రీయ జనతాదళ్-కాంగ్రెస్ మహాకూటమి ప్రస్తుతం హోరాహోరీగా ప్రచారాలు కొనసాగిస్తున్నాయి ఈ రెండు కూటమి పార్టీలతో సంబంధం లేకుండానే ఒంటరిగా ప్రశాంత్ కిషోర్ జెన్ సూరజ్ పార్టీ బరిలో నిలవబోతోంది. తన సొంత నియోజకవర్గమైన రాగేపూర్ నుంచి మొదట ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ RJD చీఫ్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సొంత నియోజకవర్గం కావడంతో ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తున్నారని ఆయనకు వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ నిలబడతారనుకున్నప్పటికీ.. అక్కడి నుంచి వైదొలగడం పెద్ద ట్విస్ట్ గా మారింది. అక్కడ తన బదులుగా మరొక అభ్యర్థిని పోటీలో దింపబోతున్నారు ప్రశాంత్ కిషోర్.
తాను ఎన్నికలలో పోటీ చేయడం వల్ల తమ పార్టీ కార్యక్రమాలకు చాలా ఆటంకాలు కలుగుతున్నాయని ఈ ఎన్నికలలో పార్టీ 150 సీట్ల కంటే తక్కువ వస్తే అది తమ ఓటమికే కారణమవుతుందని ప్రశాంత్ కిషోర్ తెలియజేశారు. ఎన్నికలలో తాము అధికారంలోకి వస్తే బీహార్ ను దేశంలోని అత్యంత అభివృద్ధి దేశంగా చేసి తీరుతామని తెలియజేశారు ప్రశాంత్ కిషోర్. ప్రజలు తమపై పూర్తి విశ్వాసాన్ని చూపకపోతే, జనంలోకి వెళ్లి పాదయాత్రలు చేస్తామని కూడా తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిని అంతం చేస్తామని 100 మంది అత్యంత అవినీతిపరులైన నాయకుల గురించి విచారించి వారికి శిక్ష పడేలా చేస్తామంటూ ప్రకటించారు ప్రశాంత్ కిషోర్. ఈ ఎన్నికలు తనకు లైఫ్ అండ్ డెత్ వంటివి అంటూ తెలియజేశారు.