
కొంతమంది బ్యాక్‌డ్రాప్ క్వాలిటీ, లొకేషన్ సెట్ డిజైన్ గురించి చిన్న చిన్న కామెంట్లు చేసినా, ఫుల్ సాంగ్ విడుదల తర్వాత అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, చిరంజీవి స్టైల్ స్టెప్స్, నయనతార గ్లామర్ స్క్రీన్‌పై కలిసి మేజిక్ క్రియేట్ చేశాయి. మాజీ భార్యాభర్తలుగా చూపించిన చిరంజీవి - నయనతారల మధ్య కెమిస్ట్రీ సన్నివేశాలు సూపర్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌కి అనీల్ రావిపూడి టచ్ జోడించడంతో ఈ చిత్రం మాస్, క్లాస్ రెండింటినీ ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. సోషల్ మీడియాలో “మీసాల పిల్ల” ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా ట్రెండ్ అవుతుండగా, ఆడియెన్స్‌లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రతి విభాగం అత్యున్నత స్థాయిలో వర్క్ చేస్తోంది. చిరంజీవి గ్రేస్, అనీల్ కామెడీ - ఎమోషన్ మిక్స్ స్క్రీన్‌పై విజయం సాధించనుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో గట్టిగా ఉంది. ఈ సినిమా రాబోయే ఫెస్టివల్ సీజన్‌లో థియేటర్లలో సందడి చేయనుందని టాక్. మొత్తానికి, “మన శంకర వర ప్రసాద్ గారు”తో మాస్ జాతర పండుగలా ఉండబోతోందని చెప్పొచ్చు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.