ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అవ్వాలంటే కచ్చితంగా బీప్ సౌండ్ పడాలి, లేకపోతే ఒక బూతు డైలాగ్ ఉండాలి, లేదంటే హాట్ సీన్స్ ఉండాలి అనే ధోరణి పెరుగుతోంది. ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే పేరుతో కొంతమంది దర్శకులు సినిమాల్లో ఇలాంటి సీన్స్‌ని ఉద్దేశపూర్వకంగా చేర్చుతున్నారు అంటున్నారు జనాలు. కానీ ఇదే ట్రెండ్ ఇప్పుడు వివాదాలకు దారితీస్తోంది. ఇటీవలే యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రాశీ ఖన్నా మరియు శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ‘తెలుసు కదా’ సినిమా కూడా ఇదే కోవలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావిడి చేస్తూ, సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తేశారు. మొదట ఈ సినిమా క్లాస్ టచ్‌తో, భావోద్వేగాలతో నిండిన కథతో వస్తోందని అనుకున్నారు. కానీ ట్రైలర్ విడుదల తర్వాత పరిస్థితి కొంచెం మారింది.


ట్రైలర్‌లో కనిపించిన కొన్ని హాట్ సీన్స్, అలాగే కొంత బోల్డ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా హీరో హర్ష పాత్రలో కనిపించిన కొన్ని భంగిమలు, మాట్లాడిన డైలాగులు కుటుంబ ప్రేక్షకులకు అసౌకర్యంగా అనిపించేలా ఉన్నాయని సెన్సార్ బోర్డ్ సభ్యులు అభిప్రాయపడ్డారు. ట్రైలర్ చివర్లో హీరో వంగి చూపించిన ఒక సీన్‌పై సెన్సార్ అధికారులు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారని సమాచారం. సెన్సార్ బోర్డ్ స్పష్టంగా “ఆ సీన్‌ని పూర్తిగా తొలగించాలి” అని సూచించిందట. అంతేకాదు, సినిమాలోని కొన్ని బూతు డైలాగ్స్‌పై కూడా బోర్డ్ కఠినంగా వ్యవహరించి, వాటిని బీప్ చేయాలని ఆదేశించిందని టాక్. ఈ హెచ్చరిక తర్వాత చిత్రబృందం వెంటనే ఆ సూచనలను అంగీకరించి, సెన్సార్ సూచనల ప్రకారం కట్స్ పెట్టిందని తెలుస్తోంది.



సినిమాకు చివరకు “U/A” సర్టిఫికెట్ లభించింది. అయితే, సెన్సార్ టీం మొదటగా ఈ సీన్‌లు అలాగే వదిలేస్తే, సినిమా “ఆ” సర్టిఫికేట్ తీసుకునే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. “ఆ” సర్టిఫికెట్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతారని, దాంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందని భావించిన చిత్ర బృందం, ఎటువంటి వాదోపవాదాలు లేకుండా సైలెంట్‌గా సెన్సార్ సూచనలు పాటించిందని తెలుస్తోంది.ఈ సెన్సార్ వార్నింగ్ తర్వాత, ‘తెలుసు కదా’ టీం మరింత జాగ్రత్తగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే ట్రైలర్ వైరల్ కావడంతో సినిమా హైప్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు సెన్సార్ వివాదం కూడా చేరడంతో సినిమాపై మరింత కుతూహలం పెరిగింది.



ఇకపోతే, సినిమా కథలో ఎమోషనల్ ఫన్, రొమాంటిక్ ట్రాక్, మరియు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో ఉన్నాయని టీం చెబుతోంది. అయితే ప్రేక్షకుల దృష్టిలో మాత్రం ప్రస్తుతం ఉన్న హాట్ సీన్స్, బీప్ డైలాగ్స్ పై ఆసక్తి ఎక్కువగా ఉంది.సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాతే నిజమైన జడ్జ్‌మెంట్ వెలువడనుంది. ఇప్పుడు అందరి దృష్టి ‘తెలుసు కదా’ ఫస్ట్ డే కలెక్షన్ల పై పడింది. సెన్సార్ వార్నింగ్ తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్‌లో దూసుకుపోతాయో చూడాలి.మొత్తానికి, సెన్సార్ వార్నింగ్‌తో కొంత వెనక్కి తగ్గిన ‘తెలుసు కదా’ టీం, ఇప్పుడు క్లీనుగా కానీ కంటెంట్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: