కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు అభివృద్ధి మరొకవైపు సంక్షేమ పథకాలు అలాగే హిందూ దేవాలయాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. అందుకు ఉదాహరణగా తిరుమల శ్రీవారి ట్రస్ట్ కు భారీగానే విరాళాలు పెరిగిపోయాయి. గడిచిన 11 నెలలలోనే రూ. 918.6 కోట్ల రూపాయలు విరాళాలు అందినట్లుగా ttd చైర్మన్ బి.ఆర్.నాయుడు తెలియజేశారు.. 2024 నవంబర్ 1 నుంచి 2025 అక్టోబర్ 16 వరకు ఈ మొత్తం విరాళాలు అందినట్లుగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే క్రమంగా దాతలు కూడా పెరుగుతున్నారని చైర్మన్ బి.ఆర్ నాయుడు తెలియజేశారు.


అంతేకాకుండా ఇందులో కొంతమంది నగదుతో పాటుగా యంత్రాల కొనుగోలు, సాంకేతిక అభివృద్ధి, భవన నిర్మాణాలకు కూడా సహకారం అందిస్తామని తెలిపారట. ముఖ్యంగా ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లోనే ఎక్కువగా భక్తులు విరాళాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అలా ఆన్లైన్లో నుంచి రూ 579.38  కోట్ల రూపాయలు వచ్చాయని ఆఫ్లైన్ నుంచి రూ. 339.20 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలియజేశారు. మరి ఏ ఏ ట్రస్టుల్లో ఎంత విరాళం వచ్చిందనే విషయానికి వస్తే..


టీటీడీలోని ఉండే 11 ట్రస్టులలో అత్యధికంగా ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.338.81 కోట్లు, అలాగే రెండవ స్థానంలో శ్రీవాణి ట్రస్ట్ రూ.252.84కోట్లు ,ఆ తర్వాత శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని ట్రస్ట్ రూ.97.97 కోట్లు,ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ రూ.66.53 కోట్లు, ఎస్వి గోసంరక్షణ రూ.56.78 కోట్లు, బర్డ్ రూ.30.03 కోట్లు, ఎస్వి విద్యాదానం రూ.33.47 కోట్లు, ఎస్వి సర్వే శ్రేయాస్ రూ.20.46 కోట్లు, ఎస్వి వేద పరిరక్షణ రూ.13.88 కోట్లు, ఎస్విబిసి  రూ.6.30 కోట్లు, స్విమ్స్ రూ.1.52 కోట్లు చొప్పున విరాళా రూపంలో అందాయి. అలాగే తిరుమల శ్రీవారి హుండీ రెండు రోజులలోనే రూ.8.83 కోట్ల రూపాయలు ఆదాయం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: