తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ దారుణ హత్యకు గురైన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిజామాబాద్‌లో బైకు దొంగతనం కేసులో అరెస్టు చేస్తుండగా, కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో ప్రమోద్ గాయపరిచి మరణించాడు. ఈ ఘటన అక్టోబర్ 17న జరిగింది. పోలీసు శాఖను తీవ్రంగా కదిలించింది. డీజీపీ శివధర్ రెడ్డి వెంటనే మాన్‌హంట్‌కు ఆదేశాలు జారీ చేసి, తీవ్ర నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ప్రభుత్వం GO Rt No. 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా మొత్తం, పదవీ విరమణ వరకు చివరి జీతం సహా అందిస్తుంది. అలాగే, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, GO 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తారు.

పోలీస్ భద్రతా సంక్షేమం నుండి 16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షలు అదనపు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు. మొత్తం రూ. కోటికి పైగా పరిహారం ఈ కుటుంబానికి సహాయపడి, వారి ఆర్థిక భద్రతను నెలకొల్పుతుంది.

ప్రమోద్ కుటుంబానికి పోలీసు శాఖ తరపున ఘన నివాళులు అర్పించిన డీజీపీ శివధర్ రెడ్డి, వారి భవిష్యత్తును రక్షించేందుకు పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 42 సంవత్సరాల ప్రమోద్ భార్య ప్రణీత, ముగ్గురు చిన్నారులు అతి కష్టాల్లో పడ్డారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడి, వారి జీవితాన్ని స్థిరపరచడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని డీజీపీ తెలిపారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రమోద్ వంటి యోధులకు తెలంగాణ పోలీసు శాఖ తరపున నా హృదయపూర్వక నివాళులని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: