ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి పాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. చాలామంది  ఇప్పుడు అమలవుతున్న పథకాలతో పోల్చి చూస్తే గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ సంఖ్యలో పథకాలు అమలు అయ్యాయని భావిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పదేపదే టార్గెట్ చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 2029లో కూడా వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకుండా చేయాలనే పటిష్ట ప్రణాళికతో బాబు, పవన్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

కూటమి ప్రభుత్వం ఇప్పటికే 'సూపర్ సిక్స్' పథకాలను అమలు చేశామని చెబుతున్నప్పటికీ, కొన్ని కీలక హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదనే విషయం వాస్తవం. అయినప్పటికీ, తమ పాలనలోనే రాష్ట్రానికి కొత్త కంపెనీలు వచ్చాయని కూటమి సర్కార్ బలంగా చెబుతోంది. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని కూటమి ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తోంది. విశాఖపట్నం 'గ్రోత్ ఇంజిన్' అవుతుందని గతంలో జగన్ చెప్పిన మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయని రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య.

 2029 ఎన్నికల్లో సైతం జగన్‌ను ఓడించగలిగితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమకు తిరుగుండదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌ను పదేపదే టార్గెట్ చేయడానికి, ఆయన పాలనను విమర్శించడానికి అసలు కారణం ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా వైఎస్సార్సీపీకి ఏ మాత్రం అవకాశం లేకుండా చేసి, తమ రాజకీయ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలని కూటమి నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కూటమి అధికారంలోకి వచ్చి నెలలు  గడిచినా, ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల జ్ఞాపకంలో సజీవంగా ఉంచడం. దీని ద్వారా, ప్రజలు తమ దృష్టిని ప్రస్తుత ప్రభుత్వ పనితీరు నుండి మళ్లించి, గత ప్రభుత్వ లోపాలను గుర్తుంచుకునేలా చేయడం ద్వారా కూటమి సర్కార్ బెనిఫిట్ పొందాలని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: