“తానే చెప్పిందే తుది నిర్ణయం” అన్నట్టుగా ఆదేశాలు ఇచ్చిన మాధవి, ఇతరుల సిఫార్సు లేఖలను పట్టించుకోవద్దని చెప్పడంతో టీడీపీ నేతలు పూర్తిగా డిస్టెన్స్ అయ్యారు. జిల్లా స్థాయి నేతలు కూడా మాధవిపై ఫిర్యాదులు చేసినా, ఆమె మాత్రం “నా పద్ధతి నాకు తెలుసు” అన్నట్టుగా డోన్ట్ కేర్ మోడ్‌లో ఉన్నారని సమాచారం. ఇక తాజాగా జరిగిన ఘటన ఈ అంతర్గత విభేదాలకు నిదర్శనం లాంటిదే. పూసపాటి రేగ మండలం కోనాడ గ్రామంలో తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకారులకు రేషన్ పంపిణీ చేయడానికి వెళ్లిన మాధవిని ప్రజలు అడ్డుకున్నారు. “ఎందుకు అందరికీ సమానంగా సహాయం ఇవ్వడం లేదు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లోకం మాధవి అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. కానీ జనసేన వర్గాలు మాత్రం ఇది సహజంగా జరిగినదని నమ్మడం లేదు. వెనక కూటమి నేతలే ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన నాయకుల అభిప్రాయం ప్రకారం, లోకం మాధవిని బలహీనపరచాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలే ఈ వివాదాలకు ఊతమిస్తున్నారట. “ఎలాగైనా మాధవి ఇమేజ్ దెబ్బతీయాలి” అనే వ్యూహంతో సోషల్ మీడియాలో ప్రచారం జరిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే లోకం మాధవి మాత్రం తగ్గేదేలేదు అన్నట్టుగా తన పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి పెట్టుతున్నారు. నెలిమర్లలో ఈ అంతర్గత కూటమి పోరు జనసేన భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఒకవైపు బలహీనమవుతున్న కూటమి ఐక్యత, మరోవైపు స్వతంత్రంగా నిలబడాలన్న మాధవి ధైర్యం – రెండూ కలగలిసి ఆ నియోజకవర్గ రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చేశాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి