మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె వై.ఎస్. సునీతను వైసీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఘటన నాంపల్లి సీబీఐ కోర్టు వద్ద పెద్ద ఎత్తున సంచలనం రేపింది. ఈ అనూహ్య పరిణామం రాజకీయ వర్గాల్లోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగించాలన్న పిటిషన్‌పై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో సునీత కోర్టుకు హాజరయ్యారు. హత్య కేసు విచారణ, దర్యాప్తు పురోగతి, నిందితుల స్థితిగతులు వంటి విషయాలపై ఆమె న్యాయవాదులతో కలిసి కోర్టుకు చేరుకున్నారు. ఇదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ కోసం అదే కోర్టు పరిధిలో హాజరయ్యారు.

కోర్టు గేటు వద్ద ఇద్దరి రాక దాదాపు ఒకేసారి కావడంతో అక్కడున్న వారికి కొద్ది క్షణాల పాటు టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కుటుంబం ఒకటే అయినా, కేసులు, ఆరోపణలు, రాజకీయ విభేదాలు ఇరువురి మధ్య భారీ అంతరం సృష్టించాయి. ఈ సందర్భంలో అచ్చం సినిమాలో లా  సునీతను చూసినా కూడా జగన్ ఒక్క చూపు కూడా వేయకుండా, పలకరింపులేవీ చేయకుండా నేరుగా కోర్టు లోపలికి వెళ్లిపోవడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు జగన్ చేసిన యాక్టింగ్ ని ఆస్కార్ ఇవ్వాలి అంటూ పొగిడేస్తున్నారు . ఒకే కుటుంబానికి చెందిన బాధితులు—నిందితులు ఒకే సమయంలో ఒకే కోర్టు పరిధిలో కనిపించడం చాలా అరుదు. ఈ సంఘటనపై అక్కడి న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బంది కూడా విశేషంగా దృష్టి పెట్టారు. కొందరు ఈ పరిణామాన్ని కేవలం కోఇన్సిడెన్స్‌గానే భావించగా, మరికొందరు మాత్రం ఇది జగన్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగా భావిస్తున్నారు.

వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రారంభమైనప్పటి నుంచి సునీత బహిరంగంగా పలుమార్లు జగన్‌పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి హత్యకు సంబంధించి అనేక ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లభించలేదని ఆమె పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ కోర్టు వద్ద ఆమెను పూర్తిగా పట్టించుకోకపోవడం ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ విశ్లేషకులు, పార్టీల నేతలు, ప్రజలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కోర్టు గేటు వద్ద జరిగిన ఈ చిన్న సంఘటన భారీ రాజకీయ చర్చకు దారితీసిన నేపథ్యంలో, ఇది ఇంకా ఎంత వరకూ సీరియస్‌ మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: