ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం 2026 ప్రకారం రాష్ట్రపతి ఆమోదం. పార్లమెంటులో ఉభయ సభలు ఆమోదం తెలిపిన తర్వాతే ఈ బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది అనంతరం సోమవారం బిల్లును చట్టబద్ధత కల్పిస్తు ఉత్తర్వులను జారీ చేశారు. దీని ద్వారా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇది కీలక పరిమాణం. ముఖ్యంగా సెక్షన్ 5 లో సవరణలు చేసి కొత్త రాజధాని అనే చోట అమరావతి రాజధానిగా పేర్కొనాలి అంటూ ఈ గెజిట్ తో స్పష్టం చేశారు. దీంతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా ప్రకటించింది కేంద్రం.
అమరావతి పరిధిలోని రాజధాని ప్రాంతం అంటే సిఆర్డిఏ చట్టం ప్రకారంగానే గెజిట్ ఉంటుందంటూ పేర్కొన్నారు. 2024 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చినట్టుగా పొందుపరిచారు. 2024 జూన్ రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ కి అధికార రాజధానిగా అమరావతి పిలవబడుతుంది. ఏప్రిల్ ఒకటి రెండవ తేదీన పార్లమెంటు ఉప సభ్యులు అమరావతి చట్టబద్ధత బిల్లుని ఆమోదించారు. సుమారుగా 5 గంటల పాటు లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లు పైన చర్చలు జరిగాయి. దీంతో అక్కడ ఎలాంటి సవరణలు లేకుండానే ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాంత ప్రజలు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమరావతి రైతులకు కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి