టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ భారత దేశంలో 125 కోట్ల జనాభా ఉంటే జిల్లాలు 683 ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. దేశ వ్యాప్తంగా జిల్లాల్లో సగటు జనాభా 18.3లక్షలు అని అన్నారు. కానీ, తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇది 36లక్షలు ఉందని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.



ఈలోగా ఆయనకు ఫోన్ రావడంతో సమావేశం మధ్యలో వెళ్లిపోయారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన రాజ్భవన్కు వెళ్లారు. కేంద్రహోంశాఖ మంత్రి రాజ్నాథ్ నుంచి కేసీఆర్కు ఫోన్ రావడంతో ఆయన హడావుడిగా వెళ్లాల్సి వచ్చింది. అనంతరం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 



సుమారు అరగంట పాటు వీరిద్దరి మధ్యా భేటీ జరుగగా, న్యాయాధికారులు, న్యాయవాదుల వివాదంపై గవర్నర్ కు వివరించినట్టు తెలిసింది. హైకోర్టు విభజన ఆలస్యం అవుతుండటంతో, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, ఇక్కడి న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియ ఉదంతాలను ఆయన వివరించినట్టు సమాచారం. పరిస్థితులు సద్దుమణగాలంటే, తక్షణం హైకోర్టు విభజన జరగాల్సిందేనని, అందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కోరినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: