భారత దేశంలో ఈ మద్య కొత్త కొత్త ఛాలెంజ్ ప్రోగ్రామ్ లు వస్తున్నాయి.  ఈ మద్య  కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ప్రారంభించిన ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్టీ సహచరులకే కాదు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీ (ఎస్) కి చెందిన హెచ్.డి.కుమారస్వామికి కూడా ఫిట్‌నెస్ సవాలు విసిరారు.
Image result for ప్రధాని ఛాలెంజ్
మూడు వారాల క్రితం మోదీ భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఇదే విధమైన సవాలును స్వీకరించారు, మళ్లీ బుధవారం , తన ఫిట్‌నెస్ వీడియోని పోస్ట్ చేస్తూ సీఎం కుమారస్వామితోపాటు టిటి ఛాంపియన్ మనికా బాత్రాకు ఫిట్‌నెస్ సవాలును జారీ చేశారు. 40 ఏళ్ల వయసు దాటిన ఐపిఎస్ అధికారులకు కూడా మోదీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరారు.

తాజాగా తనను టార్గెట్ చేస్తూ ఫిట్ నెస్ చాలెంజ్ చేయడంపై కర్ణాటక సీఎం కుమారస్వామి వెంటనే స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. "ప్రియమైన నరేంద్రమోదీ... నా ఆరోగ్యంపై మీకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు.

శారీరక ఫిట్ నెస్ ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని నేను నమ్ముతాను. ఫిట్ నెస్ చాలెంజ్ కి నేను మద్దతిస్తున్నాను. యోగా, ట్రెడ్ మిల్ నా దైనందిన జీవితంలో భాగమే. నా రాష్ట్ర ప్రజల ఫిట్ నెస్ ను మరింతగా పెంచేందుకు మీ సహకారం కావాలి" అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: