తెలంగాణా ఎన్నికల ఫలితాలతో వైసీపీ అధినేత జగన్ లో కొత్త జోష్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. అక్కడ కూటమి కట్టి ఓటమి పాలు అయిన చంద్రబాబునాయుడు తీరుపై జగన్ సెటైర్లు వేశారు. బాబు అబద్దాలు నమ్మి ఓటు వేయలేదని, అందుకే ఆయనను అక్కడ ఓడించారని జగన్ చెప్పారు. బాబు తో పాటు ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా  కూడా ఫలితాలు వచ్చాయని ఆయన విశ్లేషించారు.


అనైతిక పొత్తులకు చెక్:


నాలుగు నెలల క్రితం వరకూ తిట్టుకుని ఈ రోజు తెలంగాణా ఎన్నికలు పేరు చెప్పి కలసినందువల్లనే బాబు, కాంగ్రెస్ కూటమికి తెలంగాణ జనం నమ్మలేదని జగన్ అన్నారు. పాదయాత్రలో భాగంగా ఆముదాలవలసలో ఈ రోజు నిర్వహిచిన బహిరంగసభలో జగన్ మాట్లాడుతూ, అక్కడ గెలిచేందుకు అనేక వక్రమార్గాలు అనుసరించినా చివరకు జనం తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. అక్కడ పెద్ద ఎత్తున పట్టుపడిన నగదు కూడా ఏపీ ప్రజలను లూటీ చేసి పంచినదేనని జగన్ అన్నారు


లగడపాటిపై విసుర్లు :


ఈ సందర్భంగా జగన్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పైన కూడా పంచులు వేశారు. లగడపాటి రాజకీయ  విశ్లేషకుని అవతారం ఎపుడు ఎత్తారో అర్ధం కాలేదని అన్నారు. తెలంగాణాలో మహా కూటమే గెలుస్తుందని లగడపాటి చేత చెప్పించారని, ఇదంతా బాబు, ఎల్లో మీడియా కలసి ఆడిన నాటకమని అన్నారు. అయినా అక్కడ జనం నమ్మలేదని, టీయారెస్ నే గెలిపించి వీటికి చెక్ పెట్టారని జగన్ చెప్పుకొచ్చారు.  ఏపీలో పదకొండు జిల్లాల్లో కరవు తాండవిస్తోంటే బాధ్యత మరచి ఏపీ ప్రభుత్వం రాజకీయ ప్రచారాలు, సభలు పెట్టుకుంటూ కాలం గడుపుతోందని జగన్ విమర్శించారు ఆముదాలవలస సభకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: