డేటా చౌర్యం కేసు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఓ ప్రైవేటు సంస్థ చేతిలో ఉందనేది ఈ కేసు ప్రధాన ఆరోపణ. ఈ సమాచారాన్ని అధికార తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకోసం ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో కంప్లెయింట్ ఇచ్చారు. ఇది తెలంగాణకు సంబంధించింది కాదని ఏపీ వాదిస్తోంటే.. ఫిర్యాదుదారుడు, ఫిర్యాదు ఎదుర్కొంటున్న సంస్థ రెండూ హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయని, కాబట్టి ఇది తమ పరిధిలోనిదేనని తెలంగాణ వాదిస్తోంది.

 Image result for it grids hyderabad

తెలుగు దేశం పార్టికి చెందిన అనేక మొబైల్ అప్లికేషన్ లకు అనుసంధానమైన సంస్థ ఐటీ గ్రీడ్.. ఒక్క సారి ప్లే స్టోర్ లో టీడీపీకి సంబంధించిన ఏదైనా యాప్ క్లిక్ చేస్తే దాని కింద ఐటి గ్రీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనేక పథకాల్లో లబ్ది పొందిన సుమారు 3 కో్ట్ల ప్రజల వివరాలను ఐటి గ్రీడ్ సంస్థ డేటాబేస్ లో  పొందపరచి ఉన్నాయి. ఇప్పుడు అదే డేటా బేస్ ను ఆసారాగా తీసుకుని ఐటి గ్రీడ్ సంస్థ రానున్న ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కిందనే ఫిర్యాదు సైబరాబాద్ పోలీసులకు అందింది. ..

 Image result for it grids hyderabad

కూకట్ పల్లి కి చెందిన లోకెశ్వరెడ్డి అనే వ్యక్తి ఐటి గ్రీడ్ సంస్ధపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పగడ్బందీగా ఉండాల్సిన ప్రజల గోప్యత సమాచారాన్ని వాడుకుని ఆయా నియోజికవర్గాల్లో ఏజెంట్లను నియమించి ప్రజలు ఎవ్వరెవరు తమ పార్టికి అనూకూలంగా ఉన్నారో ఎవ్వరూ అనూకూలంగా లేరో వారి వివరాలను ఎప్పటికప్పుడు టీడీపికి చెందిన సేవామిత్రా అనే యాప్ లో ఏజెంట్లు అప్డేట్  చేస్తారు.. వీటి ద్వారా తమ పార్టికి అనూకూలంగా లేని ప్రజల ఓట్లను తొలగిస్తున్నారంటూ లోకెశ్వరెడ్డి పోలీసులకు తెలిపాడు. 

 Image result for data war in ap

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐటీ గ్రీడ్ సంస్థ ఉద్యోగులను విచారించేందుకు సంస్థలో పని చేసే పలువురికి నోటిసులు జారీ చేసి వారిని విచారించింది. అయితే తాము కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్లమేనని తమకేమి తెలియదని పోలీసుల ముందు చెప్పినట్టు సమాచారం. మరో వైపు ఐటి గ్రీడ్ సంస్థ డైరెక్టర్ అశోక్ గుంటూర్ జిల్లాలో ఓ ఫిర్యాదు చేశారు. తమ కంపెనీలో పని చేసే భాస్కర్ అనే వ్యక్తి  ఫిబ్రవరి 28న గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాడని అప్పటి నుండి తనకు అందుబాటులోకి రావడం లేదని భాస్కర్ పై మిస్సింగ్ కంప్టైంట్ ఇచ్చాడు. అశోక్  ఇచ్చిన ఫిర్యదు మేరకు రంగంలోకి దిగారు ఏపి పోలీసులు . భాస్కర్ పని చేస్తున్న మాధాపూర్ లోని ఐటి గ్రీడ్  సంస్థకు 2వ తేది రాత్రి ఏపి పోలీసులు వెళ్ళారు. ఒక్కసారిగా అక్కడున్న పరిస్థితి చూసి ఉల్లిక్కి పడ్డారు ఏపి పోలీసులు. అదే సమయంలో మాదాపూర్ పోలీసులతో పాటూ సైబర్ క్రైం పోలీసులు ఐటి గ్రీడ్ కార్యాలయాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఐటి గ్రీడ్ సంస్థ పై లోకేశ్వరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటి గ్రీడ్ సంస్థలో సోదాలు చేశారు మాదాపూర్ పోలీసులు. 

 Image result for it grids hyderabad

ఐటీ గ్రిడ్ లో పనిచేసే భాస్కర్, ఫణి, చంద్ర శేఖర్, విక్రమ్ గౌడ్ లకు నోటీసులు జారి చేసి వారిని విచారించారు మాదాపూర్ పోలీసులు. ఇంతలో తమ నలుగురు ఉద్యోగులు కనబడటం లేదంటూ ఐటీ గ్రీడ్ డైరెక్టర్ అశోక్ హైకోర్ట్ లో హెబిఎస్ కార్పస్ పిటిషన్ దా ఖాలు చేశాడు. సైబర్ క్రైం పోలీసులం అని చెప్పి తమ నలుగురు ఉద్యోగులను ఎలాంటి  సమచారం ఇవ్వకుండా ఎక్కడికో తీసుకెళ్ళారంటూ పిటిషన్ లో పెర్కొన్నారు. అయితే సైబరాబాద్ పోలీసులు మాత్రం వారికి నోటిసులు ఇచ్చి విచారణకు పిలిచామని చెబుతున్నారు. ఇదీలా ఉంటే ఫిర్యాదు చేసిన లోకేశ్వరెడ్డి నివాసముండే ఇందు ఫార్చూన్ విల్లా చుట్టూ ఏపి పోలీసులు మొహరించారు. లోకేశ్వరెడ్డి ఇంట్లోకి వెళ్ళి  కొంత మంది బెదిరింపులకు పాల్పడ్డారంటూ సైబరాబాద్ సిపి సజ్జనార్ కు ఫిర్యాదు చేశాడు లోకేశ్వరెడ్డి. 

 Image result for tdp vs ycp trs

ప్రస్తుతం ఈ కేసులో తెలాల్సింది రెండు అంశాలు. ఒకటి ప్రజల గోప్యతను ఆసారాగా చేసుకుని  ఓట్లు తొలగించారా అనే అంశం. మరొకటి ఒక వేళ అలా జరిగి ఉంటే దానికి భాధ్యులు ఎవరు అనేది తేలాల్సి ఉంది. అయితే తమ పార్టికి చెందిన  ఐటి కంపెని పై తెలంగాణ పోలీసులు, మోడి, కేసీఆర్, జగన్ కలిసి కుట్ర చేశారని లోకేష్ ట్విట్టర్ లో మండిపడ్డారు. అయితే ఫిర్యాదు దారుడు, ఫిర్యాదు అందిన సంస్థ రెండూ హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తున్నాయి కాబట్టే తెలంగాణ పోలీసులు విచారణ జరుపుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు భయమెందుకని ప్రశ్నించారు. మరి ఈ వ్యవహారం ఎటు వెళ్తుందో చూడాలి మరి.!


మరింత సమాచారం తెలుసుకోండి: