అమలాపురం వైసీపీ చింత అనురాధ మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. గ్రామ ప్రజలు తమకు ఆమె వద్దంటే వద్దని చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే తన భర్త యొక్క ఆగడాలను , అక్రమాలను నుంచి కాపాడుకోవటానికి జగన్ పార్టీ లోకి చేరిందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. నియోజక వర్గంలో వైసీపీ శ్రేణులు మూడుగ్రూప్ లుగా విడిపోవటం ఆ పార్టీ ను కలవర పెడుతుంది. 


ఇటువంటి పరిణామాలు జనసేన అభ్యర్ధికి కలిసి వస్తాయని కొంత మంది చెప్పుకొస్తున్నారు. మాలమహానాయకుడు పీవిరావు తమ్మడి భార్య అయిన చింతా అనురాధ మొదటిసారి వైసీపీ తరుపున ఎన్నికల బరిలో నిలుచున్నారు. గత కొంతకాలంగా పార్టీ తరుపున జరిగిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారామె. టీడీపీ నుంచి ఎన్నికైన  రవీంద్రబాబు చివరి నిమిషంలో వైసీపీలో చేరినా జగన్ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు.


రవీంద్రబాబు నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోలేదనే ఆరోపణ ఉంది. ముఖ్యంగా గ్యాస్బావుల విషయంలో ఆయన రక్షణ చర్యలు చేపట్టలేదని అంటున్నారు. ఇదే అస్త్రంగా మలుచుకొని వైసీపీ అభ్యర్థి ప్రజల వద్దకు వెళ్తున్నారు. అలాగే సామాజిక వర్గం సపోర్టు అధికంగా ఉండడంతో ఈ సారి గెలుపు తనదేనని భావించారు. అయితే ఇప్పుడు ఇలా అనురాధ మీద కూడా వ్యతిరేకత రావటం అనేది ఎన్నికల్లో ఏ మేర నష్టం చేకూర్చుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: