అనగనగా ఒక వూరిలో చంద్రయ్య అనే షావుకారు వుండేవాడు..ఆయన దుకాణంలో చిదానందం అనే ఒక వ్యక్తి కొత్తగా పనిలో చేరాడు. ఒకరోజు అతడు చంద్రయ్యతో 'అయ్యా! రేపు పనిలోకి రాలేను. కాబట్టి సెలవు కావాలి' అని అన్నాడు.

అప్పుడు చంద్రయ్య విసురుగా 'ఇవి పండగ రోజులు. బేరసారాల మాటేమో కాను..ఇప్పుడు నీకు సెలవు ఇవ్వడం  కుదరదు అంటూ కోపంగా అన్నాడు.ఇక సెలవు ఇవ్వకపోతే ఇక్కడ పనిచేయడం దండగా అనుకున్న చిదానందం బదులు చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

మరో రెండు రోజులు పోయాక చిదానందం.. షావుకారు  చంద్రయ్య దుకాణం తెరవకముందే అతడి ఇంటికి వెళ్లి 'ఇవాళ పనికి రాను, సెలవు ఇప్పించండి.'అని అడగ్గా, చంద్రయ్య విసుక్కుంటూ 'ఇలా చీటికీ మాటికీ సెలవులడగడం ఏమీ బాగోలేదు. దుకాణం తీసే వేళయింది పద'అన్నాడు

ఇదంతా చూస్తున్న చంద్రయ్య భార్య అతన్ని సైగచేసి, పిలిచి నెమ్మదిగా ఇంతకు ముందున్న పనివాడు చెప్పాపెట్టకుండా సెలవు పెడుతున్నాడనే కదా పనిలోంచి తీసేసింది. అతడికి ఒక రోజు సెలవిస్తే  కొంపేమీ మునిగిపోతూ కదా! అన్నది

చంద్రయ్య నవ్వుతూ 'నువ్వున్నది నిజమే'అంటూ వెళ్ళిపోతున్న చిదానందాన్ని వెనక్కి పిలిచి 'నువ్వు సెలవడగడం, నేనీవ్వకపోవటం, నువ్వు మాట్లాడకుండా వెళ్లిపోవడం చూస్తుంటే అది నీ విధేయత అనుకోవాలా లేక నిజంగా కావలిసే సెలవు అడుగుతున్నావా?' అన్నాడు 'అయ్యా! నాకు కావాల్సింది మీరు సెలవు ఇవ్వననడమే'అన్నాడు చిదానందం.

అతని సమాధానానికి చంద్రయ్య, అతని భార్య అవాక్కయ్యారు. చిదానందం వాళ్లతో మొన్న సెలవ డిగింది. పొరుగూరి పుట్టింటిలో నా భార్యని దిగబెట్టి రావటానికి. ఒక్కసారి అక్కడికి వెళ్లిందంటే ఆమె ఒక పట్టాన తిరిగి రాదు. ఇవాళ సెలవిమన్నది ఆమెని దేవుడి తిరునాళ్ళలో తిప్పి తీసుకురావటానికి. అక్కడ ఆమె నా చేత పెట్టించబోయే ఖర్చుని భరించే స్తోమత నాకు లేదంటూ వెళ్ళిపోతుంటే 'అసలు విషయం ఇదా'అంటూ వాళ్ళిద్దరూ కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అంతేకాదు చిదానందం సూక్ష్మ బుద్ధికి వారు ఆశ్చర్యపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: