ఒక అడవిలో చాలా కుందేళ్లు ఉండేవి. అవన్నీ కలిసి ఓ రోజు అత్యవసరంగా సమావేశమయ్యాయి. వాటిలో ఒక కుందేలు లేచి ఏం జీవితం మనది? అడవిలోని జంతువులన్నీ మనకంటే పెద్దవి.. పైగా మన అంతా పిరికి జంతువులు ఏవి లేవు. ఎక్కడ నుంచి చిన్న శబ్దం వచ్చిన పారిపోవాల్సిందే ఇలాంటి బతుకు బతకడం కన్నా చావటం నయం అంది. అన్ని కుందేళ్లు ఆ మాట నిజమే... నిజమే అనుకున్నాయి. దాంతో అన్ని కలిసి చనిపోవటానికి నిర్ణయించుకున్నాయి.

కానీ వాటిలో పెద్ద కుందేలు మాత్రం ఆత్మహత్య మహాపాపం అయినా మనల్ని మనం ఎందుకు తక్కువ అంచనా వేసుకోవడం అంది. లేదు లేదు మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్దాం. అప్పుడు మమ్మల్ని ఎందుకిలా పిరికి వాళ్లుగా పుట్టించావు అని దేవుడిని అడగవచ్చు అని చెప్పాయి. మిగతా కుందేళ్లు పెద్ద కుందేలుఎంత చెప్పిన అవి వినిపించుకోలేదు. ఆ అడవిలోనే ఉన్న కొలనులో దూకి చనిపోవాలనుకున్నాయి.
 

కుందేళ్ళన్నీ   కొలను వైపు వెళ్లాయి. అదే సమయంలో ఆ కొలను ఒడ్డున కొన్ని కప్పలు మాట్లాడుకుంటున్నాయి. తమ వైపు వస్తున్న కుందేళ్ళ గుంపుని చూసి అవి బెదిరిపోయాయి. తమను చంపడానికే వస్తున్నాయని భయపడి కొలనులోకి దూకేసాయి. అది చూసి కుందేలు ఆశ్చర్యపోయాయి. అప్పుడు పెద్ద కుందేలు చూశారా... మనల్ని చూసి భయపడ్డాయంటే ఈ కప్పలు మనకంటే పిరికి అన్నమాట మన కంటే బలమైన జంతువున్నట్లే మనకన్నా పిరికివి కూడా  ఉన్నాయి. అది సృష్టి తీరు.

అయినా చచ్చి ఏమి సాధిస్తారు మన పైకి దాడి చేసే జంతువును ఒక్కరుగా ఎదిరించలేకపోతే.. అందరము కలిసి ఎదుర్కొందాం అని ధైర్యాన్ని నూరిపోసింది. అప్పటికీ మిగతా కుందేళ్ళకు తమ తప్పేమిటో తెలిసి వచ్చింది. సమస్య వస్తే పరిష్కారం కోసం ఆలోచించాలి. తప్ప చనిపోవాలి అనుకోవటం సరికాదని అర్థం చేసుకు న్నాయి. ఇక ఆ రోజు నుంచీ భయ పడుతున్న తమ సమస్యలను నిర్వహించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: