స్తనాలు పైకి ఉబికని స్వేదగ్రంధులేనని ఒకచోట వివరించటం జరిగింది. ఇవి పాలను స్రవింపచేయటానికి ఉపయోగపడతాయి. వాటి చుట్టూ కొవ్వుచేరటం వల్ల స్తనాలకు మెత్తదనంతో కూడిన స్పర్శను కల్గిస్తాయి. ఎత్తయిన స్తనాలు అన్నది వాటిల్లో చేరే కొవ్వు పధార్థాన్ని బట్టి వుంటుంది. టీనేజి అమ్మాయిలు, తమ తోటివారి స్తనాల సైజు, తక్కువని చెప్పి, విపరీతంగా బాదపడి పోతుంటారు దానిలో అర్థం లేదు. ఎత్తయిన స్తనాలకు లైంగిక వాంఛకు సంబంధం లేదు. ఒక స్తనం పెద్దది, మరొకొటి చిన్నది : టీనేజి అమ్మాయిల్లో వుండే మరొక పెద్ద ధర్మసందేహం ఇది ఒక స్తనం చిన్నదిగా వుండటం, శారీరక లోపం వల్ల ఏర్పడిందేమోనని సందేహం వారిని పీడిస్తుంది. మీకు తెలుసా ? మీరెండు చేతులూ ఒకే పొడుగు, ఒకేలా వుండవు అట్లాగే మీరెండు పాదాలు కూడా చెప్పులు కొనుక్కునేటపుడు ఈ విషయం మీకు తెలిసే వుంటుంది. అట్లాగే మీకనుబొబొమ్మలు కూడా రెండూ ఒకేలా వుండవు. అయితే ఈ తేడా స్తనాలు విషయంలోనే ఎందుకంత స్పష్టంగా కన్పిస్తుంది? టీనేజి అమ్మాయిల్లో స్తనాల రెండింటిని పెరుగుదలలో ఈ తేడా వెంటనే గుర్తించగల స్థాయిలో వుంటుంది. దానికి కారణం రెండూ స్తనాలు ఎదుగుతూ వుండటమే అయితే రెండు స్తనాల ఎదుగుదలా ఒకేలా ఉండదు. ఒక స్తనం ఎదిగే లోపునే మరొక స్తనం పుష్ఠిగా ఎదిగి పోతుంది. కాగా ఎదుగుదల కొనసాగుతూ వున్నకాల వ్యవదిలో, చిన్నగా వుండే స్తనం, ఎదిగి, పెరిగిన స్తనం స్థాయికి చేరుకునేంతవరకు అది పెద్దదిగా కన్పిస్తుంది. ఇది ఒక సహజమైన పరిమాణం. దీనికి ఖంగారు పడవల్సిన పనిలేదు. ఇందుకు భిన్నంగా, రెండుస్తనాల మధ్య తేడా మరింత ఎక్కువగా కనబడుతూ వున్నట్టయితే, శరీరంలో పౌష్ఠికాహారంలోపం కారణంచేతనో, మరేదో కారణంచేతనో, ఒక స్తనం పెరుగుదల నిలిచి పోయిందని అర్థం అపుడు మీరు వైద్యులను సంప్రదించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: