భారతదేశంలో దేవుళ్ళకు నైవేద్యాలు పెట్టడంలో ఒక్కొక్కచోట ఒక్కోరకంగా ఉండటం చూస్తూనే ఉంటాం. ఒక్కోచోట ఒక్కో నైవేద్యం ప్రధానంగా కూడా ఉంటుంది. తిరుపతి లడ్డు, అయ్యప్ప ప్రసాదం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ పుణ్యక్షేత్రంలో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ దేవుళ్ళకు సమర్పించిన పిదప, భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. కొన్ని చోట్ల కేవలం దేవుళ్ళకు మాత్రమే నివేదించే ప్రసాదాలు కూడా ఉంటాయి. అవి కొందరికి మాత్రమే ప్రసాదంగా ఇస్తుంటారు. పుణ్యక్షేత్రాల నుండి సాధారణ దేవాలయాల వరకు అన్నింటా ఇలాంటి ఆచారం అమలు అవుతూనే ఉంది. అది తీసుకోవడం వలన భక్తులకు ఆయా దేవుళ్ళ ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం.

కొన్ని చోట్ల కాస్త బిన్నంగా కూడా ఈ నైవేద్యాలు ఉంటాయి. అవి ఎందుకు అలా ఉంటాయి అని అడిగితే, ఆయా భక్తులు ప్రేమతో దైవానికి తమ వద్ద ఉన్నది కూడా సమర్పించడంతో మురిసిపోయిన దైవం, అప్పటి నుండి దానిని తీసుకోవడం ప్రారంభిస్తాడు. అదంతా ఆయన అవ్యాజమైన ప్రేమకు తార్ఖానంగా గురువులు చెపుతూ ఉంటారు. అందుకే అక్కడక్కడా సాంప్రదాయానికి బిన్నంగా కూడా కొన్ని నైవేద్యాలు చూస్తుంటాము. కేరళలో కూడా అలాంటి దేవత ఉన్నారు. ఆమెకు ఒకనాడు ఒక పిల్లవాడు తన వద్ద ఉన్న చాక్లేట్ నైవేద్యంగా సమర్పించాడట, అలా చేసిన తరువాత ఆ పిల్లవాడు అదృశ్యం అయ్యాడని అక్కడ చెపుతారు.

అది మొదలు అక్కడ పిల్లలు కాదు, పెద్దలు కూడా దేవతకు చాక్లేట్ ను నైవేద్యంగా సమర్పించడం అలవాటు చేసుకున్నారు. అది ఎంతవరకు వచ్చిందంటే, ఒక స్థాయిలో ఆయా పిల్లల బరువుకు తగిన చాక్లేట్ లను కూడా దేవతకు నివేదించడం మొదలు పెట్టారు భక్తులు. 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ ఆలయంలో భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. పెద్దఎత్తున ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇదంతా కేరళలోని అలప్పుజాలోని కెమ్మోత్ శ్రీ సుబ్రమణ్య దేవాలయంలోని దేవతకు చేస్తారు. అయితే ఈ కొత్త నైవేద్యం సమర్పించే ఆచారం మాత్రం దశాబ్ద కాలం నుండే ప్రారంభం అయ్యిందట. దశాబ్దం కిందట ఒక పిల్లవాడు అమ్మవారికి గర్బగుడిలోనే చాక్లేట్ ను నైవేద్యంగా సమర్పించి అదృశ్యం అయ్యాడట. అప్పటి నుండి ఇది ప్రాచుర్యం పొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: