అనుకున్నట్టుగానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి పేలవమైన ఫాంని ప్రదర్శించి అపజయ పాలయ్యింది. సొంతగడ్డపై బోణి కొడుతుందని ఆశించిన సన్ రైజర్స్ కు ఆ అవకాశాన్ని కలగనివ్వలేదు కోల్ కతా కె కెప్టెన్ గంభీర్. శనివారం ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన ఐ.పి.ఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. 


ఇయాన్ మోర్గాన్ (43 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), నమన్ ఓజా (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు ఆమోదయోగ్యమైన స్కోర్ ను అందించారు. ఇక 143 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్ కత సన్ రైజర్స్ బౌలర్లను చీల్చి చెండాడింది. గంభీర్ విజయ విహారం చేయగా మ్యాచ్ అవలీలగా 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 146 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.


గంభీర్, ఉతప్పలు కలిసి తొలి వికెట్‌కు 75 బంతుల్లో 92 పరుగులు జత చేయడంతో కోల్ కతకు టార్గెట్ రీచ్ అవడంలో ఎలాంటి ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న శిఖర్ థావన్ మరోసారి విఫలమయ్యాడు. ఇక వార్నర్ కూడా వచ్చిన అవకాశాన్ని సరిగా వాడుకోక త్వరగానే పెవిలియన్ బాట పట్టాడు. 


స్కోరు వివరాలు ఇలా ఉన్నాయి: 


సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (సి) సూర్యకుమార్ (బి) ఉమేశ్ 13; ధావన్ (సి) ఉతప్ప (బి) మోర్కెల్ 6; హెన్రిక్స్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 6; మోర్గాన్ (సి) షకీబ్ (బి) ఉమేశ్ 51; హుడా (సి) ఉమేశ్ (బి) రసెల్ 6; ఓజా (సి) చావ్లా (బి) మోర్కెల్ 37; ఆశిష్ రెడ్డి రనౌట్ 13; కరణ్ నాటౌట్ 2; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142.
 వికెట్ల పతనం: 1-18; 2-23; 3-36; 4-50; 5-117; 6-128; 7-141.
 బౌలింగ్: మోర్కెల్ 4-0-35-2; ఉమేశ్ 4-0-28-3; షకీబ్ 3-0-18-0; రసెల్ 4-0-19-1; నరైన్ 4-0-26-0; చావ్లా 1-0-13-0.


 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (ఎల్బీ) (బి) ఆశిష్ 38; గంభీర్ (నాటౌట్) 90; రసెల్ (బి) ముస్తఫిజుర్ 2; పాండే (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 146.
 వికెట్ల పతనం: 1-92; 2-97.
 బౌలింగ్: భువనేశ్వర్ 4-0-29-0; శరణ్ 4-0-31-0; ముస్తఫిజుర్ 4-0-29-1; కరణ్ 2.2-0-24-0; హెన్రిక్స్ 2-0-19-0; ఆశిష్ రెడ్డి 2-0-14-1. 


మరింత సమాచారం తెలుసుకోండి: