
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప సినిమాకు సంబంధించిన మేనరిజం వైరల్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్రీవల్లి పాటపై అల్లు అర్జున్ వేసిన స్టెప్పులను అనుకరిస్తున్నారు ఎంతోమంది. అటు క్రికెటర్లు కూడా పుష్ప పాట పై డాన్స్ లు వేస్తూ ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ పుష్ప హవా నడుస్తూ ఉండటం గమనార్హం. ఒక మ్యాచ్లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ డీజే బ్రావో పుష్ప సినిమాలోని శ్రీవల్లి స్టెప్పులు వేశాడు.
దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక మరోవైపు ఇదే లీగ్ లో మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆటగాడు నజ్రుల్ ఇస్లాం కూడా పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట లో ఉండే స్టెప్స్ వేసి ఆకట్టుకోవడం గమనార్హం. ఇక దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో ఇది చూసిన బన్నీ అభిమానులందరూ మురిసిపోతున్నారు. ఎక్కడ చూసినా మా హీరో హవానే నడుస్తోంది అని అనుకుంటున్నారు. ఇక అంతకు ముందు శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా పుష్ప పాట పై స్టెప్పులు వేయడం వైరల్ గా మారిన విషయం తెలిసిందే.