
ఇక పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఉండేందుకు ముంబైలోని బ్రాండ్ న్యూ హోమ్ లో ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొట్టాయి. దీంతో కె.ఎల్.రాహుల్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా ఎంతగానో సంతోష పడిపోయారు. ఇక కె.ఎల్.రాహుల్ ప్రేమ వివాహానికి సిద్ధం కావడంతో మరింత ఆనంద పడిపోయారు. అయితే కేఎల్ రాహుల్ తో పెళ్లి విషయంపై ఇటీవలే హీరోయిన్ అతియా శెట్టి స్పందించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హాజరైంది అతియా శెట్టి. ఈ క్రమంలోనే కె.ఎల్.రాహుల్ తో డేటింగ్ పెళ్లి విషయంపై ఒక ప్రశ్న ఎదురైంది.
ఇక ఇలాంటి ప్రశ్న వినగానే అతియా శెట్టి ఒక్కసారిగా నవ్వేసింది. దీనిపై నేను ఎలాంటి కామెంట్ చేయలేను అంటూ చెప్పింది. ఇలాంటి రూమర్స్ విని విని విసిగి పోయాను. ఇలాంటి వార్తలకు నేను నవ్వుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను. ప్రజలకు ఎలా అనిపిస్తే అలా అనుకొనివ్వండి వారికి నచ్చినట్లుగా వారు ఆలోచిస్తున్నారు అంటూ అతియా శెట్టి బదులిచ్చి అందరినీ కన్ఫ్యూజన్లో పడేసింది. అంతేకాకుండా కేఎల్ రాహుల్ తో కొత్త ఇంటికి మారుతుంది అంటు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. నేను కొత్త ఇంటికి మారుతున్న మాట వాస్తవమే.. కానీ ఎవరితోనో కాదు నా కుటుంబంతో.. త్వరలోనే మా అమ్మానాన్న నా సోదరుడితో కలిసి ముంబైలోని బాంద్రాలో కొత్త ఇంటికి మారబోతున్న అంటూ చెప్పుకొచ్చింది.