రవి శాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు ఎంతో అద్వితీయమైన విజయాలను సాధించింది అని చెప్పాలి. సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్ లలో అదరగొట్టిన టీమిండియా జట్టు ప్రపంచ కప్ లలో మాత్రం నిరాశ పరిచింది అనే చెప్పాలి. రవి శాస్త్రి నేత్రుత్వంలోనే 2019 వన్డే ప్రపంచకప్ లో సెమీ ఫైనల్లో ఓడిపోయింది భారత జట్టు. 2021లో వరల్డ్ బెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా ఓటమిపాలైంది. ఇక టి 20 ప్రపంచకప్లో అయితే లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది అనే విషయం తెలిసిందే. ఇక అంతలోనే రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో ఇక రాహుల్ ద్రవిడ్ కోచ్ గా రావడం జరిగింది.


 ఇక కొన్నాళ్లు విశ్రాంతి తర్వాత కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చాడు రవిశాస్త్రి. ఈ క్రమంలోనే ఇటీవల మాట్లాడుతూ ప్రపంచ కప్ లో భారత జట్టు గెలవక పోవడానికి కారణం ఏంటి అన్న విషయంపై ఇటీవలే రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఒక ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడం వల్లనే కోచ్ గా తన హయాంలో ప్రపంచకప్ లు సాధించలేకపోయాము అంటూ  చెప్పుకొచ్చాడు.  ఈ విషయం గురించి సెలెక్టర్లకు ఎంత చెప్పినప్పటికీ పట్టించుకోలేదంటూ తెలిపాడు. హార్దిక్ పాండ్యా లాంటి ఫేస్ ఆల్రౌండర్ గాయపడితే ఇక మెగా టోర్నీలో జట్టు రాణించడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి.



 ఇక ఇదే కారణంతో భారత జట్టు  ఎప్పుడు ఓడిపోని పాకిస్థాన్ చేతిలో కూడా ఓడిపోయి  లీగ్ దశలోనే ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా అప్పుడు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా ఇటీవల జరిగిన ఐపీఎల్ లో మాత్రమే సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చాడు  అన్న విషయం తెలిసిందే. ఒకవైపు గుజరాత్ జట్టు కెప్టెన్గా మొదటి ప్రయత్నంలోనే టైటిల్ అందించడమే కాదు ఇక టీమిండియా  ఆడుతున్న వరుస సిరీస్లలో కూడా బౌలింగ్ బ్యాటింగ్ లో అదరగొడుతూ తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నాడు. ఇక రాబోయే వరల్డ్కప్లో హార్దిక్ పాండ్యా ఎంతో కీలకంగా మారబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: