మొన్నటి వరకు అంతంతమాత్రంగానే టీమిండియాలో అవకాశం దక్కించుకున్న యువ ఆల్రౌండర్ దీపక్ హుడా ఇక ఇప్పుడు మాత్రం అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యుత్తమ మైన ఫామ్ కనబరుస్తున్న దీపక్ హుడా  ఐపీఎల్ లో సత్తా చాటి టీమిండియా లో అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇక టీమిండియా లోకి వచ్చిన తర్వాత మరింత మెరుగైన ప్రదర్శన చేస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు అని చెప్పాలి. ఇక ఆడిన ప్రతీ మ్యాచ్లో కూడా అదరగొడుతున్నాడు దీపక్ హుడా.


 మెరుపు బ్యాటింగ్తో అభిమానులందరినీ కూడా ఉర్రూతలూగిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలోనూ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. మెరుపు బ్యాటింగ్ చేసి 25 పరుగులు చేయడమే కాదు బౌలింగ్ లో కూడా సత్తా చాటి కీలకమైన వికెట్ పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర వహించాడు అనే చెప్పాలి. ఈక్రమంలోనే జింబాబ్వేతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో దీపక్ హుడా ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.


 దీపక్ కూడా టీమిండియా లోకి అరంగేట్రం చేసిన తర్వాత అతను ఆడిన 16 మ్యాచ్లో కూడా భారత జట్టు విజయం సాధించడం గమనార్హం. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జట్టులోకి వచ్చిన తర్వాత వరుసగా 16 విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా దీపక్ హుడా నిలిచాడు.  ఇప్పటివరకు 9 టీ20లు 7 వన్డేలలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు దీపక్ హుడా. ఇక అన్ని మ్యాచ్ లలో కూడా టీమిండియా విజయం సాధించింది. అయితే సాట్విక్ నడిగోతీయ రికార్డును బద్దలు కొట్టాడు ఈ యువ ఆల్రౌండర్. నడిగోటియా అరంగేట్రం చేసినా జరిగిన  15 మ్యాచ్లో రొమేనియా జట్టు విజయం సాధించింది. ఇప్పుడూ అతని రికార్డులు బద్దలు కొట్టి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు దీపక్ హుడా.

మరింత సమాచారం తెలుసుకోండి: