పాకిస్తాన్లో ప్రస్తుతం స్టార్ బౌలర్ గా కొనసాగుతున్న షాహీన్ అఫ్రిది ఇటీవలే ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్ జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. గాయం బారినపడిన షాహీన్ ఆఫ్రిడి చివరికి విశ్రాంతి తీసుకున్నాడు. అతను లండన్లో చికిత్స పొందుతున్నాడు అన్నది తెలుస్తుంది. కాగా ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.  కాబోయే అల్లుడు పాకిస్థాన్ స్టార్ పేసర్ ఆఫ్రిది గాయంపై పాకిస్తాన్  క్రికెట్ బోర్డు నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్నదని పై మండిపడ్డాడు షాహిద్ అఫ్రిది.


 ప్రస్తుతం షాహీన్ అఫ్రిది లండన్ లో తన సొంత డబ్బుతోనే చికిత్స తీసుకుంటున్నాడని అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు అంటూ విమర్శలు చేశాడు షాహిద్ అఫ్రిది. ఇటీవలే ఒక టీవీ చానల్ తో మాట్లాడినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. తన సొంత ఖర్చుతో  షాహీన్ అఫ్రిది లండన్ కి వెళ్ళాడు. విమాన టికెట్ ఖర్చులు కూడా అతడివే. లండన్ లో చికిత్స కోసం షాహీన్ ఖర్చుపెడుతున్న ప్రతి అంతా కూడా అతను సంపాదించింది.. అతని కోసం నేను అక్కడ నాకు తెలిసిన ఒక డాక్టర్ను  మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చాడు.


 ఆటగాళ్ళ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు ఏమీ బాలేదు. పాకిస్తాన్ జట్టుకు షాహీన్ అఫ్రిది ఎంతో సేవ చేస్తున్నా కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతని పట్టించుకోవడం లేదు అంటూ వ్యాఖ్యానించాడు షాహిద్ అఫ్రిది. ఇకపోతే షాహిద్ అఫ్రిది పెద్ద కూతురు షాహిన్ కు ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇద్దరు ఎన్నో రోజుల నుంచి ప్రేమ లో కొనసాగుతున్నారు. కాగా వీరికి ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. కాగా షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: