
అదే సమయంలో ఇక ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికాతో ఇండియా లో జరిగే టి20 సిరీస్ లకు కూడా ఎంపిక అయ్యాడు. దాదాపు తొమ్మిది నెలల గ్యాప్ తర్వాత టి-20 జట్టుకు ఎంపికైన మహ్మద్ షమీ బాగా రాణించి ఇక టి20 వరల్డ్ కప్ జట్టులోకి వస్తాడు అని అందరూ భావించారు. ఇలాంటి సమయంలో ఊహించనివిధంగా షమి నీ దురదృష్టం వెంటాడింది. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడటంతో మహమ్మద్ షమీ క్వారంటైన్ కి పరిమితం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక తద్వారా అతను ఆస్ట్రేలియా టి20 సిరీస్ కు దూరం అయ్యాడు అని చెప్పాలి.
షమి వైరస్ బారినపడి దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో ఉమేష్ యాదవ్ ను ఎంపిక చేశారు. అతన్ని అయితే ఎంపిక చేయడంపై అటు విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మహమ్మద్ ఈ ఏడాది ఒక అంతర్జాతీయ టి20 కూడా ఆడలేదు. ఉమేష్ యాదవ్ మూడేళ్ల నుంచి జట్టుకు దూరంగానే ఉన్నాడు. అయితే ప్రపంచ కప్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు ఇద్దరిని భారత జట్టు లో భాగం చేయడం విడ్డూరంగా ఉంది. భారత ప్రణాళికలు అన్నీ కూడా తారుమారు అయినట్లు కనిపిస్తోంది అంటూ ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు.