మొన్నటి వరకు వరుస విజయాల తో దూసుకు పోతున్న టీమిండియా ఇటీవలి కాలంలో మాత్రం ఘోరమైన పరాజయాల తో టీమిండియా అభిమానులందరినీ కూడా నిరాశ లో ముంచేస్తోంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు విన్నింగ్ కెప్టెన్ గా గుర్తింపు సంపాదించుకున్న రోహిత్ శర్మ ఇక ఇప్పుడు మాత్రం టీమిండియాకు సరైన విజయాలు అందించ లేకపోవడం తో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. మొన్నటికి మొన్న రోహిత్ శర్మ కెప్టెన్సీ లో ఆసియా కప్ గెలిచి తీరుతుంది అని అందరూ భావించారు.


 వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించడం తో ఇక అందరిలోనూ అంచనాలు మరింత పెరిగి పోయాయ్. కానీ ఆ తర్వాత కీలకమైన మ్యాచ్లలో చేతు లెత్తేసిన టీమిండియా చివరికి ఫైనల్లో అడుగుపెట్టకుండానే ఇంటిదారి పట్టింది అన్న విషయం తెలిసిందే. కాశీ ఆసియా కప్ తరువాత ప్రస్తుతం ఇండియా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. సొంత గడ్డపై టీమిండియా అదరగొడుతుంది అనుకున్నప్పటికీ   మొదటి మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే ఇక రోహిత్ కెప్టెన్సీపై టీమిండియా  ఆటగాళ్ల ప్రదర్శనపై అందరూ విమర్శలు చేస్తున్నారు.


 ఇకపోతే టీమిండియా పై వస్తున్న విమర్శలపై ఇటీవలే బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ-20 ఫార్మెట్లో టీమిండియా ఆటతీరుపై తనకు ఎలాంటి ఆందోళన లేదు అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ. గత కొన్నేళ్లుగా టీమిండియా బాగా ఆడుతుందని. కేవలం రెండు మూడు మ్యాచ్ లలో ఓటమి చెందితే అంత పట్టించుకోను అంటూ తెలిపాడు. రోహిత్ శర్మ కెప్టెన్ గా విన్నింగ్ పర్సంటేజ్ 80 శాతంగా ఉందని.. 35 మ్యాచులకు కెప్టెన్సీ వహిస్తే ఐదు లేదా ఆరు మ్యాచ్ లలో మాత్రమే టీమిండియా ఓడిపోయింది అంటూ గుర్తు చేశాడు సౌరవ్ గంగూలి.

మరింత సమాచారం తెలుసుకోండి: