ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడ అని ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 16వ తేదీన ఆస్ట్రేలియా వేదికగా ఇక వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా తమ దేశ జట్టును గెలిపించుకునేందుకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఇక అన్ని జట్లు కూడా ప్రపంచకప్ లో తాము ఎదుర్కోబోయే ప్రత్యర్థులను ఎలా ఓడించాలి అనే విషయంపై పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అని చెప్పాలి.


 అయితే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అటు ఎన్నో రోజుల సమయం లేకపోవడంతో ఇప్పటికే వరల్డ్ కప్ ఆడబోయే అన్ని జట్లు కూడా అటు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టాయి అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్లో మునిగితేలుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే గత టి20 వరల్డ్ కప్ లలో ఎవరు బాగా రాణించారు.. ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు.. ఎక్కువ పరుగులు సాధించింది ఎవరు అనే గణాంకాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి  ఇకపోతే టి20 ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ ఉల్  హసన్ మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి.



 ఇప్పటివరకు వరల్డ్ కప్ లో  షకీబ్ ఉల్  హసన్ 41 వికెట్లు సాధించాడు. తద్వారా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఇక రెండవ స్థానంలో భారత దాయాది దేశమైన పాకిస్తాన్ జట్టు స్టార్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది 39 వికెట్లతో కొనసాగుతూ ఉన్నాడు. ఇక ఇదే లిస్టులో మూడవ స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు లసిత్ మలింగ 38 వికెట్లలో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. అంతేకాకుండా నాలుగవ స్థానంలో సయూద్ అజ్మల్ 36 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత అజంతా మొండిస్, ఉమర్గుల్ 35 వికెట్లతో తర్వాత స్థానంలో ఉన్నారు. భారత సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 26 వికెట్లతో ఈ లిస్టులో కొనసాగుతున్నాడు అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: