
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ పై అటు భారత మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కేవలం భారత మాజీ ఆటగాళ్లు మాత్రమే కాదండోయ్... పాకిస్తాన్ మాజీలు సైతం విరాట్ ఇన్నింగ్స్ కి మంత్రముగ్ధులై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పై స్పందించిన పాకిస్తాన్ జట్టు మాజీ సారథి వసీం అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ విజృంభించిన తీరు చూస్తే అతడు మనిషి కాదు మరోగ్రహం నుంచి వచ్చాడేమో అని అనిపించింది. ఇటీవల కాలంలో నేను చూసిన గొప్ప ఆటగాలలో కోహ్లీ కూడా ఒకడు. ఇప్పుడు మాత్రమే కాదు గత 15 ఏళ్లుగా లక్ష్య చేదనలో అతని సగటు అత్యుత్తమంగా ఉంది అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు ఇక మరో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షో మాలిక్ సైతం విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. అతను స్ట్రైక్ రొటేట్ చేయగలడు సిక్సర్లు కొట్టగలడు. వైట్ బాల్ క్రికెట్ లో విరాట్ క్లాస్ ప్రపంచంలోనే మరే ఇతర ఆటగాడిలోనూ చూడలేం. ఆటను ఎలా ముగించాలో అతనికి బాగా తెలుసు అంటూ ప్రశంసించాడు.