ఇటీవలే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు అనూహ్యమైన విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే . చివరి బంతి వరకు విజయం కోసం పోరాడిన భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయ డంక మోగించింది. ఇలా ఈ ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను ఓడించి శుభారంభం  చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక పాకిస్తాన్ ఓడించిన భారత జట్టు ఏడాది వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారి అంచనాలకు కొన్ని సెంటిమెంట్లను కూడా జత చేస్తూ ఉండటం గమనార్హం .


 అయితే 2011లో ఇంగ్లాండ్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన సమయంలో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇప్పుడు  వరల్డ్ కప్ లో మరోసారి ఇంగ్లాండ్ ను ఐర్లాండ్ ఓడించింది. దీంతో ఈసారి కూడా వరల్డ్ కప్ టీమ్ ఇండియాదే అంటూ కొంతమంది ఒక లాజిక్ పట్టుకున్నారు. దీని గురించి చర్చ కూడా జరుగుతుంది.  అయితే ఇటీవల మరో సెంటిమెంట్ ను తెరమీదికి తీసుకోవచ్చాడు టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి. 1985లో ఇదే మెల్బోర్న్ మైదానంలో ప్రపంచ టోర్నీ తొలి మ్యాచ్ ను పాకిస్తాన్తో ఆడి గెలిచింది భారత్. తర్వాత ఫైనల్ లోను పాకిస్తాన్తో తలబడాల్సిన పరిస్థితి వచ్చింది.


 ఇక ఫైనల్ మ్యాచ్లో కూడా భారత జట్టు పై చేయి సాధించి గెలిచింది. ఇక ప్రస్తుత పరిస్థితులు కూడా నాకు చరిత్రను గుర్తు చేస్తున్నాయి. ఇటీవల మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్ పై టీమ్ ఇండియా గెలిచింది. ఇక మరోసారి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందేమో అనిపిస్తుంది.. మరోసారి మ్యాచ్ జరిగిన జరిగేది ఇదేనేమో అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా గెలుస్తుంది అన్నదానికి ఏ చిన్న లాజిక్ దొరికిన కూడా ఎంతగానో మురిసిపోతున్న టీమిండియ అభిమానులు రవి శాస్త్రి తెరమీదకి తీసుకువస్తున్న   సెంటిమెంటును కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: