గత కొన్ని రోజుల నుంచి టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడానికి ఎంతో మంది యువ ఆటగాళ్లు ఎంత నిరీక్షణగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఐపీఎల్ కారణంగా ప్రతి ఏడాది కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అప్పటికే సత్తా చాటిన ఆటగాళ్లు సైతం ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే దేశవాళి టోర్నీలలో మంచి ప్రదర్శన చేసి బాగా రాణించినప్పటికీ కూడా జట్టులో చోటు దక్కుతుంది అన్న క్లారిటీ మాత్రం ఉండడం లేదు.


 యువ ఆటగాడు పృథ్వి షా విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. దేశవాళీ టోర్నీలో అద్భుతంగా రానించి టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేశాడు. ఇక టీమిండియాలోకి వచ్చిన కొత్తలో తన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించి సచిన్ వారసుడు అంటూ ఒక పెద్ద ట్యాగ్ కూడా సంపాదించుకున్నాడు. ఇక అతనికి అంతర్జాతీయ క్రికెట్లో తిరుగు ఉండదు అని ఎంతోమంది టీమ్ ఇండియా ఫ్యాన్స్ కూడా భావించారు. కానీ ఆ తర్వాత కాలంలో అదే ఫామ్ కొనసాగించలేకపోయిన పృథ్వి షా చివరికి నిలకడలేమితో జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ఆ తర్వాత అడపా దడపా అవకాశాలు దక్కిన కూడా నిరూపించుకోలేకపోయాడు.


 టీమిండియాలో ఛాన్స్ కోసం ఎదురుచూసిన పృథ్వి షా తనను పక్కన పెట్టినప్పుడల్లా తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వచ్చాడు. ఇక అయిపోతే ఇటీవల న్యూజిలాండ్ బంగ్లాదేశ్ లతో జరిగే వన్డే టి20 సిరీస్ కు సంబంధించిన భారత జట్టు వివరాలను ప్రకటించగా మరోసారి పృథ్వి షాకు చోటు దక్కలేదు. అయితే ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఏడు మ్యాచ్లలో 47.58 సగటుతో 285 పరుగులు చేశాడు. ఇక తన స్ట్రైక్ రేట్ 191.58 ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీన్నిబట్టి అతను ఎంతలా దంచి కొట్టాడో  అర్థం చేసుకోవచ్చు. ఇంతలా పరుగులు చేసిన అతని మాత్రం సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: