ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచ కప్ తుదిపోరులో ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టు 138 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు తమ అకౌంట్లో రెండో పొట్టి ప్రపంచక కప్ ను వేసుకుంది.మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్  బౌలింగ్ ని ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలోకి దిగిన పాకిస్తాన్  జట్టు ఆటగాళ్లు నిర్ణీత 20 ఓవర్లలో పాక్ బ్యాటర్లు 8 వికెట్ల నష్టానికి కేవలం 137 పరుగులు చేశారు. కాగా వీరిలో మసూద్ మొత్తం 28 బంతుల్లో 38 పరుగుల అత్యధిక స్కోర్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి పాక్ ఆటగాళ్లు ఈ బరిలో పాపం నిలబడలేకపోయారు. దెబ్బకు వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ బాటపట్టారు. ఇండ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మొత్తం 3 వికెట్లు తియ్యగా క్రిస్ జోర్దాన్, ఆదిల్ రషీద్ రెండో రెండు వికెట్లు తీశారు.


ఇక బెన్ స్టోక్స్ ఒక వికెట్ తీశాడు. ఇక మొత్తం 138 పరుగుల అత్యల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్ల ఇంకా ఒక ఓవర్ మిగిలుండగానే ఇంగ్లండ్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు.కష్టాల్లో ఉన్న జట్టును బెన్ స్టోక్స్ ఎంతగానో ఆదుకున్నాడు.హార్రీ బ్రూక్తో వ్యాల్యూబుల్ పాట్నర్ షిప్ను నమోదు చేశాడు. అయితే బ్రూక్ను షాదాబ్ ఖాన్ ఔట్ చేయడంతో పాక్ అభిమానుల్లో ఆశలు అనేవి కొంత చిగురించాయి. అయితే  తమ ఆనందాన్ని మాత్రం స్టోక్స్ ఎంతో సేపు ఉంచలేదు. మొయిన్ ఆలీతో కలిసి స్కోరు బోర్డును పెంచి పరుగులు పెట్టించాడు. చెత్త బంతులను చాలా ఈజీగా బండరీకి తరలించిన అతను..ఇఫ్తికర్ బౌలింగ్లో సూపర్ సిక్స్ ని కొట్టాడు.ఇక చివర్లో మొయిన్ అలీ ఔటైనా....స్టోక్స్ తన ఇంగ్లాండ్ జట్టును గెలిపించి విజయ తీరాలకు చేర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: