ఇటీవల దేశవాళి టోర్ని అయిన విజయ హాజారే ట్రోఫీలో భాగం గా ఒక ఆటగాడి పేరు ఎంతలా మారు మోగిపోయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. తమిళనాడు జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న యువ బ్యాట్స్మెన్ నారాయణ్ జగదీషన్ పేరు మారు మోగిపోయింది. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీలో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నారాయణ్ జగదీషన్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఒకే సీజన్లో ఏకం గా ఐదు సెంచరీలు సాధించాడు.


 అంతే కాదు ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్లో ఏకం గా 277 పరుగులు చేసి లిస్టు ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తి గత పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు అని చెప్పాలి. దీంతో ప్రపంచం మొత్తం నారాయణ్ జగదీషన్  పేరు మారుమోగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయ రహస్యం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఏదైనా సరే నా అంతిమ లక్ష్యం ఒక్కటే. 50 ఓవర్ల వరకు ఆడాలని కోరుకుంటాను. ఇక ప్రత్యర్థి ఎవరు అనేది కూడా పట్టించుకోను.

 అంతేకాదు నేను ఒకే పద్ధతిని అనుసరిస్తూ ఉంటాను. మిడిల్ ఆర్డర్లో ఆడేందుకు ఇష్టపడతాను. ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. బ్యాటింగ్ కీపింగ్ పై ఎప్పుడు సాధన చేస్తూనే ఉంటాను. ఇక ఈ అన్ని విషయాలపై ఎంతో కాలంగా దృష్టిపెట్టాను.  ఇక అత్యధిక పరుగులు చేసినప్పుడు నా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కిందని సంతృప్తి చెందుతూ ఉంటాను అంటూ తన బ్యాటింగ్ సీక్రెట్ ని చెప్పుకొచ్చాడు నారాయణ్ జగదీషన్. ఇక తాను సాధించిన రికార్డుల గురించి ఎప్పుడు ఆలోచించనని.. కేవలం మెరుగ్గా ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తాను అంటూ తెలిపాడు నారాయణ్ జగదీషన్.

మరింత సమాచారం తెలుసుకోండి: