ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది  ఇది సరదా కోసం వాడే సామెత అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు కొంతమంది విషయంలో మాత్రం సరిగ్గా సరిపోతు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక టీమ్ ఇండియా సీనియర్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ విషయంలో కూడా ఇది నిజం అయింది అని తెలుస్తుంది. శిఖర్ ధావన్ సీనియర్ అన్న కారణముతో టి20 ఫార్మాట్ కి దూరం అయిపోయాడు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి కేవలం వన్డే ఫార్మాట్ కి మాత్రమే పరిమితం అయ్యాడు.


 ఇక వన్ డే ఫార్మాట్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఉండటంతో ఇక ఒక్క ఫార్మాట్లో అయినా ఆడుతున్నాడు అని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్న ఒక్క అవకాశం కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అనేది తెలుస్తుంది. అది కూడా ఇటీవల డబుల్ సెంచరీ తో చెలరేగిపోయిన ఇషాన్ కిషన్ వల్లే. ఇక తర్వాత మ్యాచ్లలో సెలెక్టరు తన విస్మరించకుండా తన బ్యాటింగ్తో ప్రతిభను చూపించాడు ఇషాన్ అని చెప్పాలి.


 ఇక ఇలా ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ లోకి రావడంతో ఇక వచ్చే ఏడాది భారత వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ప్రణాళికలో భాగంగా శిఖర్ ధావన్ నూ కొనసాగించాలా లేకపోతే పక్కన పెట్టాలా అనే ఆలోచన సెలెక్టర్లకు వచ్చేలా చేశాడు ఇషాన్ కిషన్.  సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ కంటే తాను ఎంతో బెటర్ అన్న విషయాన్ని తన బ్యాటింగ్ తో నిరూపించాడు. పాతకాలపు అప్రోచ్ తో ఆడుతున్న శిఖర్ దావన్ ఇప్పటికీ కూడా వన్డే ఫార్మాట్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇషాన్ కిషన్ మాత్రం కొత్త షాట్ లతో అలరిస్తున్నాడు. దీంతో త్వరలో బీసీసీఐ నిర్వహించే రివ్యూ మీటింగ్ లో శిఖర్ ధావన్ కెరియర్ పై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: