
అయితే తన కెరియర్లో ఇదే చివరి వరల్డ్ కప్ అని స్టార్ ప్లేయర్ లీయోనల్ మెస్సి చెప్పాడు. దీంతో ఇక తన కెప్టెన్సీలో ఒక్కసారైనా అర్జెంటీనా జట్టుకు వరల్డ్ కప్ అందించాలని భావిస్తూ ఉన్నాడు. అదే సమయంలో డిపెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఫ్రాన్స్ మొరాకో జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రత్యర్థులుగా మారిపోయి జట్టు విజయం కోసం పోరాడారు.
ఫ్రాన్స్ జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న కైలిన్ అంబాపే, ఇక మొరకో జట్టులో డిపెండర్ అయినా అచ్రాఫ్ హకీమీలు ప్రాణ స్నేహితులు. ఇద్దరు కూడా కేవలం నెలన్నర వ్యవధిలోనే పుట్టారు. దేశాలు వేరైనా ఇద్దరి మనసులు మాత్రమే ఒక్కటే. ఎంబాపే గోల్ కొడితే.. హకీమీ సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇక హకీమీ గోల్ కొడితే ఎంబాపే సంబరాల్లో మునిగిపోతాడు. అంతటి ప్రాణ స్నేహితులు ఈ ఇద్దరు. కానీ ఇప్పుడు దేశం కోసం ఏకంగా ప్రత్యర్థులుగా మారిపోయారు. ఇకపోతే అటు ఆఫ్రికన్ దేశమైన మొరాకో ఇక మొదటి నుంచి సంచలన విజయాలు సాధిస్తూ దూసుకొచ్చింది. కానీ సెమీఫైనల్ లో మాత్రం చివరికి ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది.
ఇలా దేశం కోసం పోరాడిన ప్రాణ స్నేహితులలో చివరికి హాకీమీపై అంబాపే ఆదిపత్యం సాధించాడు అని చెప్పాలి. ఇక ఇలా ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుందేమో అని అందరిలో అంచనాలను పెంచేసిన మొరాకో జట్టు కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం ఢిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ నూ ఓడించలేక చివరికి టోర్ని నుంచి నిష్క్రమించింది.