
దీంతో చాలా రోజుల నుంచి ఇషాంత్ శర్మకు భారత జట్టులో స్థానం లేకుండా పోయింది. ఇలాంటి సమయంలోనే కొత్త కొత్త ఫేసర్లు తెరమీదకి వస్తున్న నేపథ్యంలో ఇక ఇషాంత్ శర్మ గురించి ఆలోచించేందుకు అటు సెలెక్టర్లకు కూడా టైం లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే ఇప్పటికే టీమ్ ఇండియాకు దూరమైన ఇషాంత్ శర్మ ఇక ఐపీఎల్ లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. కాగా గత ఏడాది జరిగిన మెగా వేలంలో అతని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దీంతో అన్ సోల్డ్ ఆటగాడిగానే మిగిలిపోయాడు.
ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. తాను ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోకపోవడం.. ఇక భారత జట్టులో చోటు కోల్పోవడం పై స్పందిస్తూ.. జట్టులో చోటు, ఐపీఎల్ గురించి తాను ఆలోచించడం ఎప్పుడో మానేశాను అంటూ చెప్పుకొచ్చాడు ఇశాంత్ శర్మ. ప్రస్తుతం తాను ఆనందంగానే ఉన్నానని.. ఇక చేస్తున్న పనిని ఆస్వాదిస్తున్నాను అంటూ ఇశాంత్ శర్మ చెప్పుకొచ్చాడు అని చెప్పాలి.