2023 ఏడాదిలో భారత్ వేదికగా  వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఈ వరల్డ్ కప్ కోసమే ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్ వేదికగా జరుగుతున్న ఈ వన్డే వరల్డ్ కప్ ను ఆతిథ్య భారత జట్టు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని చెప్పాలి. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలతో ఉంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ప్రారంభానికి కొన్ని నెలల ముందు నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇప్పటికే వరల్డ్ కప్ ఆడుబోయే 20 మంది ఆటగాళ్లకు సంబంధించి ఒక షార్ట్ లిస్ట్ కూడా సిద్ధం చేసింది అన్నది తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో సదరు ఆటగాళ్లకు పని భారం విషయంలో కూడా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది బీసీసీఐ. అయితే ఇక భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఇప్పటికే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ 2011 ప్రపంచ కప్ లో గౌతమ్ గంభీర్ ఆడినట్లుగానే ఇక విరాట్ కోహ్లీ 2023 వరల్డ్ కప్ లో ఆడి భారత జట్టును గెలిపిస్తాడని అభిప్రాయపడ్డాడు.


 2011 ప్రపంచ కప్ లో గౌతమ్ గంభీర్ ఆట తీరు అద్భుతం అతడికి అభినందనలు. గంభీర్ ను చూసి ఇప్పటికీ కూడా గర్వపడుతున్న. టోర్నీ మొత్తం  అద్భుతమైన బ్యాటింగ్ తో గౌతం గంభీర్ అదరగొట్టాడు. అయితే ఇక ఇప్పుడు 2023 ప్రపంచ కప్ లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇదే తరహాలో అద్భుత ప్రదర్శన చేస్తాడని భావిస్తున్నాను అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. కాగా 2011 ప్రపంచ కప్ హీరోలలో గౌతమ్ గంభీర్ ఒకడు అని చెప్పాలి. ఏకంగా తొమ్మిది మ్యాచ్లలో 393 పరుగులు చేశాడు. సచిన్ (482) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గా నిలిచాడు. అయితే ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్లో అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరూ విఫలమైన వేళ ఏకంగా గౌతమ్ గంభీర్ 97 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ధోని సైతం 91 పరుగులు చేశాడు. ఇక తద్వారా టీమ్ ఇండియా ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ను ముద్దాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: