
ఇకపోతే విరాట్ కోహ్లీ అటు క్రికెట్ ద్వారా వాణిజ్య ప్రకటనల ద్వారా మాత్రమే కాదు ఇక సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ నేపథ్యంలో ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే విరాట్ కోహ్లీకి మాత్రమే కాదు ఇక అతని భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు కూడా సోషల్ మీడియాలో భారీ రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఇక వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు. అంతేకాదు అభిమానులందరూ వీరి చుట్టూ చేరి ఒక్క సెల్ఫీ దొరికిన చాలు అని ఎగబడిపోతూ ఉంటారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంట ఏదైనా ఫంక్షన్కు వెళ్లిన.. ఎక్కడికి వెళ్లినా కూడా ఇక వీరికి రక్షణ కల్పించేందుకు ఎప్పుడు ఒక ప్రైవేట్ బాడీగార్డ్ కనిపిస్తూ ఉంటారు. అయితే అతనికి చెల్లించే జీతం కాస్త ప్రస్తుతం అందరిని అవక్కయ్యేలా చేస్తుంది. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంటకు రక్షణ కల్పించే బాడీగార్డ్ పేరు సోను. అయితే అతనికి కోహ్లీ ఏకంగా సంవత్సరానికి 1.2 కోట్ల రూపాయల జీతం చెల్లిస్తున్నాడట. అంతేకాదు సోనుని బాడీ గార్డ్ గా కాకుండా ఏకంగా సొంత కుటుంబ సభ్యుడిగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట భావిస్తూ ఉంటారట.