సాధారణంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఎప్పుడు టీమిండియా ఆటగాళ్లపై లేదా బీసీసీఐపై కూడా తమ అక్కసును వెళ్లగకుతూ ఉంటారు అని చెప్పాలి. తమ జట్టులో ఉన్న ఆటగాళ్లతో పోల్చి చూస్తే టీమిండియా ఆటగాళ్లు   ఎక్కడ సరితూగరు అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు. అంతేకాదు ఇక తామే ప్రపంచ క్రికెట్లో తోపులం అనే విధంగా  గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల  సొంత గడ్డపై పాకిస్తాన్ వరుసగా సిరీస్లలో ఓటమిపాలై విమర్శలు ఎదుర్కొంది.


 అదే సమయంలో భారత జట్టు ఇక సొంత గడ్డపై అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటి వరకు తామే అత్యుత్తమం ఇక తమకంటే తోపులు ఎవరూ లేరు అని గొప్పలకు పోయిన పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఇక ఇప్పుడు ప్రశంసలతో భారత జట్టును బీసీసీఐ ని కూడా ఆకాశానికి ఎత్తేస్తూ ఉండటం గమనార్హం. ఏకంగా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన పిసిబి మాజీ అధ్యక్షుడు రమిజ్ రాజా సైతం భారత ఆటగాళ్ల ప్రదర్శనను మెచ్చుకున్నాడు. పాకిస్తాన్  మాజీ కెప్టెన్ కమ్రాన్ అక్మాల్  సైతం ఇదే విషయంపై స్పందించాడు.


 గత పదేళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీ గెలవక పోయినప్పటికీ టీమ్ ఇండియా జట్టు మాత్రం ఎప్పటికీ గొప్ప టీం అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అభిప్రాయం వ్యక్తం చేసాడు అని చెప్పాలి. ఐసీసీ ట్రోఫీని గెలవడమే ప్రామాణికం అయితే.. సౌత్ ఆఫ్రికా,  కివీస్ లాంటి జట్లపై నిషేధం విధించాల్సి ఉంటుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. దేశవాళీ క్రికెట్లో బీసీసీఐ అవలంబిస్తున్న విధానాలే ఇక అంతర్జాతీయ క్రికెట్ లో భారత జట్టు సూపర్ సక్సెస్ కావడానికి కారణాలు అంటూ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్లో మాత్రం కొంతమంది అదే పనిగా డొమెస్టిక్ క్రికెట్ ను పూర్తిగా నాశనం చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: