సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ చేసే సినిమాలు కేవలం హిట్‌లు మాత్రమే కాకుండా హీరోల కెరీర్‌లో చాలా స్పెషల్ అపీరియన్స్‌గా నిలుస్తాయి. అలా ఒక స్పెషల్ అపీరియన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో కూడా చోటు చేసుకుంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేశారు.  రెండవ హీరోయిన్‌గా ‘సీతారామం’ ఫేమ్ మృణాల్  ఠాకూర్ ని తీసుకున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


ఇలాంటి భారీ సినిమాతో బిజీగా ఉన్న మహేష్ బాబుకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు రివైజ్ చేస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటివరకు ఎంతో మంది అందాల భామలతో కలిసి నటించారు . సోనాలి బింద్రే, సిమ్రాన్, సాక్షి శివానంద్, ఆర్తి అగర్వాల్, త్రిషా, ఇలియానా, సమంత, శృతిహాసన్, కాజల్ అగర్వాల్, ప్రణీత సుభాష్, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక మందన్నా, శ్రీలీల, పూజా హెగ్డే ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే. అంతేకాకుండా బాలీవుడ్ బ్యూటీస్ అయిన ప్రీతి జింతా, బిపాశా బసు, అమీషా పటేల్, కృతీ సనన్ లాంటి స్టార్ హీరోయిన్‌లతో కూడా స్క్రీన్ షేర్ చేశారు.



అయితే ఈ అందాల జాబితాలో ఓ హీరోయిన్ మాత్రం మహేష్ బాబు కెరీర్‌లో చాలా స్పెషల్ ప్లేస్ సంపాదించింది. ఎందుకంటే ఆమె మహేష్‌కు ఒకసారి తల్లిగా, మరోసారి అక్కగా కూడా నటించింది. ఆమె మరెవరో కాదు — ప్రముఖ నటి గీత.గీత తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. ఆమె కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళనాడుకు చెందిన ఈ నటి 1978లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.



గీత మరియు మహేష్ బాబు కాంబినేషన్‌లో రెండు స్పెషల్ సినిమాలు ఉన్నాయి. మొదటిది 1990లో వచ్చిన ‘బాలచంద్రుడు’ సినిమా. ఇందులో గీత, చిన్న మహేష్ బాబుకు అక్కగా నటించి తన భావోద్వేగ నటనతో అందరినీ కదిలించింది. ఆ తర్వాత 2003లో విడుదలైన సూపర్ హిట్ సినిమా ‘ఒక్కడు’ లో మహేష్ బాబుకు తల్లిగా నటించి మరొకసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తిరిగి వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు “అక్కగా నటించిన హీరోయిన్ తర్వాత తల్లిగా నటించింది — ఎంత స్పెషల్ కాంబినేషన్!” అంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. కొందరు పాత స్టిల్స్, వీడియో క్లిప్స్ షేర్ చేస్తూ గీత–మహేష్ బాబు ఆన్ స్క్రీన్ బాండింగ్‌కి ఫిదా అవుతున్నారు.నిజానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల కెరీర్‌లో ఎన్నో హీరోయిన్‌లు వస్తూ వెళ్లినా, గీత గారి పాత్రలు మాత్రం ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి. అందుకే ఇప్పుడు ఆమె పేరు మళ్లీ ట్రెండ్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: