
అదే సమయంలో ఇక భారత జట్టు 2019 - 20, 2020 - 21 లో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డం మీదనే ఓడించింది. ఇలా పుండు మీద కారం చలినట్లుగా అయిపోయింది అని చెప్పాలి. ఈ సారి మాత్రం భారత జట్టును ఇండియాలోనే ఓడించి ప్రతీకరం తీర్చుకోవాలని కంగారులు భావిస్తూ ఉన్నారు. అయితే ఇదే విషయంపై మాట్లాడుతున్న ఎంతో మంది సీనియర్లు భారత్ ను వారి సొంత దేశంలో ఓడించడం అనుకున్నంత ఈజీ కాదు అంటూ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇదే విషయంపై స్పందించిన స్పిన్నర్ స్టీవ్ ఒకేఫీ కూడా మాట్లాడాడు.
2017లో భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టులో ఉన్నాడు స్టివ్ ఒకేఫీ. ఈ క్రమంలోనే అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు భారత టూర్ నన్ను అలిసిపోయేలా చేసింది. వాస్తవానికి నేను ఇది చెప్పకూడదు. రాంచి టెస్టులో నేను ఒక్కడినే 77 ఓర్లు విసిరాను. టీమిండియా బ్యాటర్లు మమ్మల్ని మానసికంగా శారీరకంగా దారుణంగా హింసించారు. అంటే వాళ్లేదో భారీ షాట్లు ఆడి మ్యాచ్ తమవైపుకు లాగేసుకుంటారని కాదు. డిఫెన్స్ ఆడుతూ సింగిల్స్ తీస్తూ విసుగు తెప్పిస్తారు. ఎంతకు అవుట్ కారు. మన దగ్గర ఎన్ని ప్రణాళికలు ఉన్న అవన్నీ అక్కడ పనిచేయవు. తాపీగా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ డిఫెన్స్ నే ఇక భారత ఆటగాళ్లు ఆశ్రయిస్తారు. డిఫెన్స్ లో భారత ఆటగాళ్లు బుల్లెట్ ప్రూఫ్ కంటే బలంగా ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు స్టీవ్ ఓకేఫి. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు మరింత మెరుగ్గా ఉంది. జట్టులో ఆటగాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు.