ప్రస్తుతం పటిష్టమైన ఆస్ట్రేలియ జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సొంత గడ్డపై పటిష్టమైన భారత జట్టును అటు ఆస్ట్రేలియా ఎలా ఎదుర్కోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు నుంచి ఆస్ట్రేలియా మైండ్ గేమ్స్ స్టార్ట్ చేసింది. ఏకంగా భారత్ లో ఉన్న పిచ్ లు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయని.. ఇక వారికి ఉపయోగకరంగానే బీసీసీఐ కూడా పిచ్లను తయారు చేసుకుంటుంది అంటూ ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు ఆ దేశ మాజీ ప్లేయర్లు కూడా పెద్ద రాద్ధాంతం చేశారు.


 ఇక అదే సమయంలో ఎంతోమంది భారత మాజీ ఆటగాళ్ళు కూడా ఆస్ట్రేలియా చేస్తున్న ఆరోపణలపై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవలే నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో అటు ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ విభాగం పేక మేడల కుప్పకూలిపోయింది. ఇక ఇలాంటి సమయంలో కూడా మరోసారి పిచ్ పైనే విమర్శలు చేశారు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఎక్కడ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారో.. అక్కడే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ సెంచరీ చేసి చూపించాడు.


 నాగపూర్ పిచ్ అటు బ్యాట్స్మెన్ లకు అనుకూలంగా ఉండదు అని విమర్శలు చేసిన వాళ్ళ నోర్లు తన సెంచరీ తో ముయించాడు. అయితే ఇక రోహిత్ శర్మ సెంచరీ పై మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కఠినమైన పిచ్ పై ఎలా బ్యాటింగ్ చేయాలో రోహిత్ చూపించాడు. ఫుట్ వర్క్ టెంపర్ మెంట్ స్కిల్ అద్భుతంగా రోహిత్ లో ఉన్నాయి. బంతిని గట్టిగా బాదే బదులు లేటుగా ఆడాడు. స్పిన్ బౌలింగ్ ను ఫేస్ బౌలింగ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అనుకున్న టైం కి బిగ్ షాట్లు ఆడి పరుగులు రాబట్టాడు. ఇక జడేజా రోహిత్ భాగస్వామ్యం టీమిండియా కు ఎంతో ప్లస్ పాయింట్ గా మారింది అంటూ రవి శాస్త్రి ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: