
ఎందుకంటే మొన్నటి వరకు తమకంటే గ్రేట్ ఇంకెవరూ కాదు అని పగటి కలల్లో బ్రతికిన రమిజ్ రజా ఇక ఇప్పుడు రియాలిటీలోకి వస్తున్నాడు అన్నది తెలుస్తుంది. భారత జట్టు ఆటగాళ్ల ప్రతిభ గొప్పతనం గురించి తెలుసుకొని ఇక ప్రశంసలు కురిపిస్తూ ఉన్నాడు. ఇకపోతే ఇటీవలే ఆస్ట్రేలియా పై రెండు టెస్ట్ మ్యాచ్లలో టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో మరోసారి భారత జట్టు ఆటగాళ్ల ప్రతిభను కొనియాడాడు రమిజ్ రజా. ఆస్ట్రేలియా వారి సొంత గడ్డపై ఉపఖండ జట్లతో ఎలా అయితే మ్యాచ్లు ముగిస్తుందో.. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాకు అదే పరిస్థితి వచ్చింది.
ఇక ఇప్పుడు వరుస ఓవటములు చవిచూస్తూ ఉండడం చూస్తూ ఉంటే వారి సన్నద్ధత ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. ముఖ్యంగా ఇండియాకు వచ్చే ముందు ఇక టీమిండియాను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై వాళ్లకు ప్రిపరేషన్ లేదు అన్నది అర్థమవుతుంది. సాధారణంగానే భారత గడ్డపై టీమిండియను ఓడించడం అసాధ్యం. స్పిన్నర్లను ఆడటంలో ఆస్ట్రేలియా పూర్తిగా విఫలమైంది. ఒకే సెషన్ లో 9 వికెట్లు కోల్పోయారు అంటే వాళ్ళ బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ రమిజ్ రజా వ్యాఖ్యానించాడు. భారత ప్లేయర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లు అద్భుతంగా రాణించారు అంటూ కొనియాడాడు.